
మసాజ్ సెంటర్లపై దాడి.. 16 మంది అరెస్టు
మాదాపూర్ ప్రాంతంలో ఉన్న పలు మసాజ్ సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇటీవలి కాలంలో బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా మసాజ్ సెంటర్ల మీద పోలీసు దాడులు జరిగాయి. ఇక తాజాగా మాదాపూర్ ప్రాంతంలో జరిగిన దాడిలో క్రాస్ మసాజ్లు చేస్తున్న పదిమంది యువతులను, ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. మగవారికి ఆడవాళ్లు మసాజ్ చేయడం చట్టప్రకారం నేరమని, అందుకే వారిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు.