Kukatpally: స్పా, మసాజ్‌ సెంటర్ల మాటున అక్రమాలు.. | Prostitution Racket Busted In Hyderabad Kukatpally Spa Centers | Sakshi
Sakshi News home page

Kukatpally: స్పా, మసాజ్‌ సెంటర్ల మాటున అక్రమాలు.. 15 మంది అరెస్ట్‌

Published Fri, Feb 24 2023 6:24 PM | Last Updated on Fri, Feb 24 2023 6:37 PM

Prostitution Racket Busted In Hyderabad Kukatpally Spa Centers - Sakshi

సాక్షి, కూకట్‌పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్పా సెంటర్లపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. 

కాగా, పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు కూకట్‌పల్లిలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో స్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న ముఠాలను గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు 15 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. 

స్పా, మసాజ్‌ సెంటర్లు ఇవే.. 
- స్ప్రింగ్‌ వెల్‌ స్పా, మసాజ్‌ సెంటర్‌
- అవంతి స్పా, మసాజ్‌ సెంటర్‌
- సారా వెల్నెస్‌ స్పా, మసాజ్‌ సెంటర్‌
- స్నో యూనిసెక్స్‌ స్పా, మసాజ్‌సెంటర్‌

ఇక, ఈ విషయంలో సంబంధిత యజమానులు, నిర్వాహకులు, థెరపిస్టులను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement