హుస్సేన్‌సాగర్‌లో వ్యక్తి కోసం గాలింపు | tourist fell into hussain sagar in hyderabad | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లో వ్యక్తి కోసం గాలింపు

Published Sun, Nov 1 2015 8:17 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

tourist fell into hussain sagar in hyderabad

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. బోటులోంచి ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం సాగర్ నీళ్లల్లో పడిపోయాడు. అయితే, సందర్శకుల బోటు నుంచి ఓ వ్యక్తి నీళ్లలోకి దూకేశాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖైరున్నీసా బోటులో 100 మంది సందర్శకులు సాగర్‌లో విహరిస్తున్నారు.

బుద్ధ విగ్రహం వద్ద ఉన్న ఓ యువతి.. బోటులోంచి ఓ వ్యక్తి నీటిలోకి దూకినట్టు చూశానని చెప్పడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడా.. లేక ప్రమాదవశాత్తూ నీళ్లల్లో పడిపోయాడా తెలియాల్సి ఉంది. బాధితుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement