టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ఎప్పుడు ఏం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ ఏడాది (2023లో) ఎక్కువ మంది గూగుల్‌లో ఏ కార్ల కోసం సెర్చ్ చేశారు, ఎన్ని దేశాల్లో సెర్చ్ చేశారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
👉2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్ బ్రాండ్స్ జాబితాలో ప్రధానంగా జపనీస్ కార్ల తయారీ సంస్థ 'టయోటా' అగ్రస్థానం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 64 దేశాల్లో ఈ బ్రాండ్ కార్ల కోసం శోధించినట్లు తెలుస్తోంది.
👉ఆ తరువాత స్థానంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉంది. టెస్లా బ్రాండ్ కార్లను ప్రపంచంలోని సుమారు 29 కంటే ఎక్కువ దేశాలలో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా ఎక్కువ టెస్లా మోడల్ 3, మోడల్ వై, సైబర్ ట్రక్ కోసం శోధించినట్లు సమాచారం.
👉ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన కంపెనీ బీఎండబ్ల్యూ. ప్రపంచంలోని 29 కంటే ఎక్కువ దేశాలలోని ప్రజలు ఈ బ్రాండ్ కార్ల కోసం సెర్చ్ చేశారని తెలుస్తోంది. గత ఏడాది ఎక్కువ సెర్చింగ్స్ పొందిన రెండవ కంపెనీకి నిలిచిన BMW ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచింది.
👉నాలుగవ స్థానంలో నిలిచిన 'ఆడి' కార్ బ్రాండ్ కోసం 7 దేశాల్లోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు సమాచారం. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆడి సెర్చింగ్ విషయంలో నాల్గవ స్థానంలోనే నిలిచింది.
👉ఇక చివరగా ఐదవ స్థానం పొందిన కంపెనీ మెర్సిడెస్ బెంజ్. గత ఏడాది మూడవ స్థానం పొందిన బెంజ్.. ఈ ఏడాది 5వ స్థానంలో చేరింది. కేవలం ఆరు దేశాలలో మాత్రమే ఎక్కువగా ఈ కార్లను సెర్చ్ చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..
Comments
Please login to add a commentAdd a comment