జిల్లా కోర్టులోతనిఖీలు
ఒంగోలు సెంట్రల్ : జిల్లా కోర్టులో శనివారం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం కలియతిరిగాయి. నెల్లూరు కోర్టులో గతంలో ఉగ్రవాదులు బాంబులు అమర్చిన నేపథ్యంతో పాటు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరగడంతో బాంబు, డాగ్ స్క్వాడ్‌లకు ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు ప్రాంగణంలో పాడైన వాహనాలు తీసేస్తే బాంబులు అమర్చేందుకు అవకాశం ఉండదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.