bomb squad
-
వార్నీ.. ఇనుప ముక్క అని తేలేలోపే అంత బిల్డప్పా?
సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడిలో తెదేపా అధినేత చంద్రబాబు హాజరుకానున్న ‘రా.. కదలిరా’ సభాస్థలి వద్ద ఇవాళ జరిగిన పరిణామాలను నాటకీయంగా మలుచుకునేందుకు యత్నించి యెల్లో మీడియా భంగపడింది. ఆయన హెలికాఫ్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ వద్ద సిగ్నల్ బజర్ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అతలాకుతలం అయ్యారు. ఈ క్రమంలో.. బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. తీరా చూస్తే అది ఇనుప ముక్క!. చింతలపూడిలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నిర్మాణం వద్ద సిగ్నల్ బజర్ మోగిందట. దీంతో.. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే అక్కడ ఇనుప ముక్క ఉండడం వలన బజర్ మోగినట్లు పోలీసు అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇనుప ముక్క బయటకు వచ్చింది తప్ప మరి ఇతర వస్తువులు లేవని బాంబ్స్ స్క్వాడ్ నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు పోటీ స్థానం ఫిక్స్? అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్న టైంలో.. యెల్లో మీడియా మామూలుగా హడావిడి చేయలేదు. చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బా*బు బజర్ అంటూ ఓ ఛానెల్.. చంద్రబాబు రా కదలిరా సభ హెలిపాడ్ వద్ద కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అంటూ మరో వెబ్సైట్.. ఇక చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద బాంబు నేరుగా నిర్ధారించుకుని ఓ కథనం అల్లేసింది టీడీపీ అనుకూల వెబ్సైట్. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా పేజీలు సైతం ఆ తనిఖీలను మరోరకంగా ప్రచారానికి వాడుకున్నాయి. అయ్యయో.. బాబుగారికి ఏదో జరిగిపోతోందే అనే రేంజ్లో హడావిడి చేసేశాయి.. అయితే.. సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారాలను చూసి ఎవ్వరూ నమ్మ వద్దని చింతలపూడి పోలీసులు తెలిపారు. -
ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. ముంబైకి బాంబు బెదిరింపు కాల్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పలుచోట్ల బాంబులు పెట్టామని ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ముంబైలోని ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సప్ నంబరుకు ఈ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, అంతకుముందు కూడా ముంబైకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనంతరం, పోలీసుల దర్యాప్తులో భాగంగా అవన్నీ నకిలీవేనని తేలింది. -
ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబును అమర్చినట్లు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సందర్శకులందర్ని మ్యూజియం నుంచి ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలను మ్యూజియానికి పంపించారు. బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు బూటకమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి అలాంటి మెయిల్స్ కొన్ని వచ్చాయని వెల్లడించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఎక్కువైంది. దేశరాజధానిలో ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బాంబు బెదిరింపుల ఘటన జరిగింది. అటు.. ముంబయిలోనూ ఆర్బీఐ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే అయోధ్య రామాలయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు -
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీని అమర్చిన ఉగ్రవాదులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం నిముషాల వ్యవధిలో దాన్ని నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు అప్పుడే భారత దేశంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశాయి ఉగ్రమూకలు. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఐఈడీ ని అమర్చారు ఉగ్రవాదులు. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ కు సమాచారమందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐఈడీని నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ ఈ పేలుడు గనుక యధాతధంగా జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లేది. ఇది కూడా చదవండి: ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా -
Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్‌లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF — ANI (@ANI) January 2, 2023 చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్
-
చార్మినార్ వద్ద బాంబు కలకలం.. పోలీసులు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం చెలరేగింది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ వ్యాఖ్యలు చేశారు. బాంబు ఫోన్ కాల్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో చార్మినార్ వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బాంబు ఫోన్ కాల్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, నిజంగానే బాంబు అమర్చారా? లేక ఎవరైనా పోకిరీ ఇలా ఫోన్ చేశాడా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
ఆ మందుపాతర 20ఏళ్ల నాటిది
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): గాలింపు చర్యలకోసం వచ్చే పోలీసులను హతమార్చాలనే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్ నక్సలైట్లు గ్రెనేడ్ల రూపంలో అమర్చిన మందుపాతరను తాజాగా వెలికితీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో బయటపడ్డ గ్రెనేడ్లు పోలీసులను లక్ష్యం గా చేసుకునే అమర్చినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, మందుపాతరల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెండోరోజు ఆదివారం జాగిలాల సహాయంతో బాంబు స్క్వాడ్ బృందాలు దుమాల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. 20 ఏళ్ల క్రితం దుమాలను కేంద్రంగా చేసుకొని అప్పటి పీపుల్స్‌వార్, జనశక్తి నక్సలైట్లుతమ కార్యకలాపాలు కొనసాగించారు. పలుసార్లు ఇదే ప్రాంతంలో పోలీసుల నుంచి నక్సలైట్లు త్రుటిలో తప్పించుకున్న సంఘటనలున్నాయి. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నక్సలైట్లు చిట్టివాగు ప్రాంతంలో అమర్చిన గ్రెనేడ్లు 20 ఏళ్ల అనంతరం బయటపడినట్లు చెబుతున్నారు. దుమాల అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఎక్కడెక్కడ మందుపాతరలు అమర్చారన్న దానిపై జిల్లా బాంబు స్క్వాడ్ బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి. మందుపాతరలను వెలికి తీయడానికి మాజీ నక్సలైట్ల సాయాన్ని తీసుకుంటున్నారు. నాడు రాగట్టపల్లిలో.. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్టపల్లిలో జనశక్తి నక్సలైట్లు గడ్డివాములో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు కొద్దిరోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. గడ్డివాములో పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు లొంగిపోయిన నక్సలైట్ల ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. దుమాలలోనూ 20 ఏళ్ల క్రితం మందుపాతరల రూపంలో దాచి ఉంచిన గ్రెనేడ్లను స్వాధీనం చేసుకోవడం, ఈ రెండు సంఘటనలు పక్కపక్క గ్రామాల్లోనే చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దుమాలలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు అమర్చిన గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వర్ స్పష్టం చేశారు. పీపుల్స్‌వార్ నక్సలైట్లు మాత్రమే గ్రెనేడ్లను మందుపాతర్లుగా వాడతారని ఆయన వివరించారు. -
సీఎం ఇంటికి బెదిరింపు కాల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపునకు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 4.45 గంటలకు చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్దిసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ నిపుణులు సీఎం పళనిస్వామి ఇంట్లో గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా బాంబు లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా తాంబరం సమీపంలోని సేలయూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని ఆటో డ్రైవర్ వినోద్‌కుమార్‌గా గుర్తించారు. తాగిన మత్తులో భార్యతో గొడవపడి పొరపాటున ఫోన్ చేశానని అతడు పేర్కొన్నాడు. అయితే గతంలోనూ ఇదే విధంగా ఫోన్ చేయగా వార్నింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే వినోద్ భార్య దివ్య కూడా ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు వివరించారు. (అందరూ దొంగలే.! ) -
తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు చొరబడ్డ సమాచారంతో తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఆలయ కొలనులో పూడికతీత పనుల్లో ఈ పేలుడు సంభవించింది. అయితే ఆదివారం కావడంతో ఆ పనులకు విరామం ఇచ్చారు. గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడితో పాటు అతడి స్నేహితులు ఆ కొలనుకు వెళ్లారు. అక్కడ ఓ బాక్స్ లభించడంతో దానిని ఆలయం వద్దకు తీసుకొచ్చారు. దానిని తెరిచేందుకు మిత్రులు ఐదుగురు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో ఆ బాక్స్ పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సూర్యతో పాటు మరో వ్యక్తి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు రంగంలోకి దిగాయి. ఆ బాక్సు ఎక్కడి నుంచి వచ్చింది. దానిని ఆలయం కొలను వద్దకు తీసుకొచ్చి పడేసింది ఎవరు అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో కాంచీపురం పరిసరాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా చొరబడ్డ తీవ్రవాదులు కోయంబత్తూరులో తిష్టవేసి ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం రావడంతో అక్కడ జల్లెడ పట్టి ఉన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి పంపుతున్నారు. ఇందులో ముగ్గురి వద్ద మాత్రం కొన్ని గంటల పాటు విచారణ సాగినా, చివరకు వారిని వదలి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివా రం క్రైస్తవులు ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలి రావడం ఆనవాయితీ. దీంతో ముష్కరులు ఏదేని కుట్రలు చేసి ఉన్నారా అన్న ఉత్కంఠ, ఆందోళన తప్పలేదు. రంగంలోకి కమాండో బలగాలు... శ్రీలంకలో క్రైస్తవ ఆలయాన్ని టార్గెట్ చేసి పేలుళ్లు సాగిన దృష్ట్యా, అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు ఇక్కడి ఆలయాల్ని గురి పెట్టారా అన్న ఆందోళన తప్పలేదు. దీంతో కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లోని చర్చిలను వేకువజాము నుంచి పోలీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కమాండో బలగాలను సైతం రంగంలోకి దించారు. అణువణువు తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్ల తనిఖీలతో పాటు ఆయా ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అందర్నీ తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు సాగిన ప్రార్థనలు సాగడంతో అప్పటి వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా, డేగ కళ్ల నిఘాతో వ్యవహరించారు. కోయంబత్తూరు– తిరుప్పూర్ మార్గంలో అయితే, తనిఖీలు మరీ ముమ్మరం చేయడంతో వాహనచోదకులకు తంటాలు తప్పలేదు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన చర్చిలే కాదు, ఇతర ఆలయాల వద్ద సైతం తనిఖీలు సాగాయి. ప్రత్యేక భద్రతను కల్పించారు. తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా, చొరబడ్డ తీవ్రవాదుల జాడ కానరాని దృష్ట్యా, జల్లెడ పట్టే విషయంలో ఏ మాత్రం పోలీసులు తగ్గడం లేదు. అలాగే, కేరళలో పట్టుబడ్డ అబ్దుల్ వద్ద విచారణ జరిపేందుకు కోయంబత్తూరు నుంచి ప్రత్యేక బృందం బయలుదేరి వెళ్లింది. అతగాడి సాయంతోనే ఆరుగురు తీవ్రవాదులు కోయంబత్తూరులోకి ప్రవేశించి ఉండడం గమనార్హం. తుపాకీతో యువతి.. రామనాథపురంలోనూ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. తమకు అందిన సమాచారం మేరకు ఉచ్చిపులి గ్రామంలోని వినాయక ఆలయం వీధిలో ఓ ఇంటిపై పోలీసులు గురి పెట్టారు. ఆ ఇంట్లో తనిఖీలు జరపగా ఓ తుపాకీ బయటపడింది. ఆ ఇంట్లో వల్లి అనే మహిళ మాత్రమే ఉంటున్నది. విచారణలో ఆమె టైలరింగ్ చేస్తుండడమే కాకుండా, ఆమె భర్త ఓ కేసులో పుళల్ జైల్లో ఉన్నట్టు తేలింది. దీంతో వల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
మన్యంలో కలకలం
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో మరోసారి కలకలం రేగింది. మావోయిస్టులు తలపెట్టిన ముప్పును పోలీసు బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేశాయి. రిమోట్ ల్యాండ్మైన్లను గుర్తించడంతో ఆదివాసీలతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పోలీసులు జి.మాడుగుల మండలం మారుమూల నుర్మతి అవుట్‌పోస్టు సమీపంలో నాలుగు అత్యంత శక్తిమంతమైన మందుపాతరలను (ల్యాండ్మైన్లు) గురువారం పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పర్యవేక్షణలో వాటిని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. అవుట్‌పోస్టు పరిసరాల్లో సుమారు రూ.50కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరో వైపు సివిక్ యాక్షన్‌లో భగంగా గ్రామదర్శిని పేరిట చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవుట్‌పోస్టు సమీపంలో సుమారు 300 మంది ఉంటున్న గిరిజన ఆశ్రమ -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. బాంబు కలకలం
సాక్షి, ఖమ్మం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధిర రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రైన్‌లోని S 11 కోచ్ సీట్ నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు చిన్న బాక్స్‌లు, ఒక చేతి సంచీని పోలీసులు గుర్తించి వాటిని స్టేషన్‌కి దూరంగా తరలించారు. అనంతరం బాంబు స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్లో మరోసారి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఖమ్మంలో కాసేపు నిలిపివేశారు. -
బాంబ్ స్క్వాడ్ డాగ్ ‘వాఘా’ మృతి
అనంతపురం సెంట్రల్ : పోలీసు శాఖకు 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న బాంబ్ స్క్వాడ్ డాగ్ ‘వాఘా’ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ పక్కన అధికారిక లాంఛనాలతో వాఘా అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు త్రిలోక్‌నాథ్, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, నాయకులు మసూద్, ఏఆర్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సూట్‌కేస్ కలకలం
హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో సూట్ కేస్ కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సూట్ కేస్ వదిలి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్కాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్‌మైన్
► గుర్తించిన ‘ఉపాధి’ కూలీలు ► పోలీసులకు సమాచారం వెంకటాపురం (భద్రాచలం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల పరిధి మల్లాపురం సమీప పాలెం ప్రాజెక్టు వద్ద శనివారం ల్యాండ్‌మైన్ బయటపడింది. అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వేందుకు ఉపాధి హామీ కూలీలు ఉదయం పనులు చేపట్టారు. కొందరు కూలీలు కొప్పుగుట్ట సమీప అటవీప్రాంతంలో మూత్రవిసర్జనకు వెళ్లగా... కాళ్లకు కరెంట్ వైర్లు తగలడంతో వాటిని పరిశీలించారు. వైర్లు రోడ్డు మీద తవ్విన గుంత వరకు ఉండడాన్ని గమనించి భయంతో అదే ప్రాంతంలో పనిచేస్తున్న మిగతా కూలీలకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ల్యాండ్‌మైన్ గా గుర్తించారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేయించనున్నారు. -
ల్యాండ్‌మైన్ నిర్వీర్యం..తప్పిన ముప్పు
రాయిపూర్(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో భద్రతా బలగాలు ఒక మావోయిస్టును అరెస్టు చేయటంతోపాటు మందుపాతరను వెలికి తీశారు. మారేడుబాక అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలకు భండారి రామ్మూర్తి(24) అనే మావోయిస్టు పట్టుబడ్డాడు. ఉసూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015లో పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనలో రామ్మూర్తి కూడా సభ్యుడని విచారణలో తేలింది. సర్కేగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన అమర్చిన ఐదు కిలోల ఐఈడీని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ గుర్తించి వెలికి తీసింది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు దీనిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు. -
జిల్లా కోర్టులోతనిఖీలు
ఒంగోలు సెంట్రల్ : జిల్లా కోర్టులో శనివారం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం కలియతిరిగాయి. నెల్లూరు కోర్టులో గతంలో ఉగ్రవాదులు బాంబులు అమర్చిన నేపథ్యంతో పాటు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరగడంతో బాంబు, డాగ్ స్క్వాడ్లకు ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు ప్రాంగణంలో పాడైన వాహనాలు తీసేస్తే బాంబులు అమర్చేందుకు అవకాశం ఉండదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు
జంగారెడ్డిగూడెం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్లో ఇటీవల ఎన్కౌంటర్ జరగడం, మావోయిస్టులు ఈనెల3న బంద్‌కు పిలుపునివ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. బాంబ్ స్క్వాడ్‌తో ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాలుగు రోజలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది ఏఆర్ ఎస్ఐ ఎబినేజర్, కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, అఖిల్, బాలకృష్ణ ఈ తనిఖీలు నిర్వహించారు. శనివారం జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్, పారిజాతగిరి దేవాలయం, గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం, చింతలపూడి బస్టాండ్లలో బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతికార చర్యకు పాల్పడే ఆస్కారం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ల పరిధిలోని ప్రధానమైన, జనసమ్మర్ధం ఉండే సుమారు 75 ప్రాంతాలను గుర్తించి అణువణువూ తనిఖీలు చేశారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో బాంబు కలకలం
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్‌లోని 2, 7 ప్లాట్‌ఫారాలలో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు 100కు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్, బాంబుస్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ బాంబులు ఏవీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే విస్తృత తనిఖీలు చేసిన తర్వాత అక్కడ బాంబులు ఏవీ లేవని తెలియడంతో కాస్త నెమ్మదించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడిన తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు ఎక్కడైనా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ చిన్న వదంతి వచ్చినా కూడా ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడుతున్నారు. -
బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలు
-
బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలు
అక్కయ్యపాలెంలోని చేకుదురాయి బిల్డింగ్ వద్ద ఓ దుకాణంలో బాణసంచా పేలుడుతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో ఉన్న గ్యాస్ కంప్రెషర్ పేలి బాణసంచాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట బాంబు పేలిందేమోనని స్థానికులు అనుమానపడ్డారు. బాంబు స్క్వాడ్ తనిఖీతో అటువంటిదేమీ లేదని, కేవలం బాణసంచా పేలుడేనని తేల్చారు. -
భువనగిరిలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
భువనగిరి అర్బన్ వినాయక చవితిని పురస్కరించుకుని భువనగిరిలో ఏర్పాటు చేసిన వినాయకుని మండల పాల వద్ద బుధవారం నల్లగొండ నుంచి వచ్చిన బాంబు, డాగ్ స్క్వాడ్ బందం అకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని రైతుబజార్, హన్మాన్‌వాడ, కిసాన్‌నగర్, సమాద్చౌరస్తా, గంజ్మార్కెట్తో పాటు పలు వార్డులలో ప్రధాన చౌరస్తాల వద్ద, రోడ్ల వెంట డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఆలయ మండపాల పరిసరాలను, వీధులను క్షుణంగా పరిశీలించారు. కార్యక్రమంలో బాంబు, డాగ్ స్వా్కడ్ టీం హెచ్‌సీ చిన్నబాబు, నల్లగొండ ఏఆర్ పీసీలు శ్రీకాంత్, రవీందర్, కానిస్టేబుల్లు అక్బర్, వెంకటేశ్ ఉన్నారు. -
సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం
రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు సూట్‌కేస్‌ను సూపర్ మార్కెట్ ముందు వదిలి వెళ్లారు. ఇది గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కలకలానికి కారణం అయిన సూట్ కేస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జలవిహార్ వద్ద మృతదేహం కలకలం
హైదరాబాద్: నగరంలోని నక్లెస్ రోడ్డుకు దగ్గరలోని జలవిహార్ వద్ద బుధవారం గోనెసంచి కలకలం సృష్టించింది. రైల్వే లైనుకు పక్కనే ఉన్న పొదల్లో పడేసి ఉన్న గొనేసంచి నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గోనె సంచి మీద ఉన్న రక్తపు మరకలను చూసి.. మృతదేహం ఉన్నట్లుగా అనుమానించారు. కొద్దిసేపటికి సంచి నుంచి బీప్ శబ్దం వస్తుండటంతో డాగ్, బాంబ్ స్క్వాడ్ లకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న డాగ్, బాంబ్ స్క్వాడ్ లు తనిఖీలు నిర్వహించి సంచిలో చుట్టి పడేసిన కుక్క మృతదేహాన్ని గోనెసంచి నుంచి బయటకు తీశాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాట్ విలర్ జాతికి చెందిన ఆడ కుక్కను చంపి పొదల్లో పడేసినట్లు చెప్పారు. కాగా, రాట్ విలర్ జాతికి చెందిన కుక్కల విలువ రూ.10వేల నుంచి రూ. 1.35 లక్షల వరకు కూడా ఉంటుంది. ఈ కుక్కను ఎవరో కిడ్నాప్ చేసి, తీసుకొచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఎవరో పెంచుకుంటున్న కుక్క అని స్పష్టంగా తెలుస్తోంది. మృతదేహం కనపడటంతో శునకాలతో పోలీసుల తనిఖీ జలవిహార్ ప్రాంతంలో బయటపడిన రాట్ వీలర్ శునకం కళేబరం -
ఎయిర్‌పోర్టులో కారు కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలో రెండు నెలలుగా ఉంచిన కారు అధికారులను ఉరుకులు పెట్టించింది. మంగళవారం రాత్రి ఆ కారుపై ఆరా తీసిన అధికారులు.. అది వనస్థలిపురం వాసిదిగా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలోని (బీ) పార్కింగ్ ఏరియాలో రెండు నెలలుగా ఉన్న కారును గుర్తించిన పార్కింగ్ నిర్వాహకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఆ నానో కారు వనస్థలిపురానికి చెందిన మేఘేష్ కుమార్ శివశంకర్దిగా గుర్తించారు. బుధవారం ఉదయం బాంబుస్వ్కాడ్ బృందం కారును పూర్తిగా తనిఖీ చేసి అందులో ఏమీ లేదని తేల్చింది. కారును అన్ని రోజుల పాటు వదిలేసి వెళ్లడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బాగ్‌అంబర్‌పేటలో సూట్‌కేసు కలకలం
గుర్తు తెలియని వ్యక్తులు పుట్‌పాత్‌పై వదిలేసిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూట్‌కేసు పుట్‌పాత్‌పై ఉండడంతో స్థానికులు అందోళనకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం...బాగ్‌అంబర్‌పేట అయ్యప్ప ఆలయం సమీపంలో పుట్‌పాత్‌పై ఓ సూట్‌కేసు పడి ఉంది. దానిని ఎంతసేపటికి ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ బాంబ్‌స్క్వాడ్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసి చాకచక్యంగా సూట్‌కేసును తెరిచారు. అందులో ఏమీ లేకపోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ సూట్‌కేసును చెత్త సేకరించే వారు ఇక్కడ వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు
► పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు ► బెళగావిలో రెండు గంటల పాటు ► రైళ్ల రాక పోక లు బంద్ సాక్షి, బళ్లారి(బెళగావి) : కర్ణాటకలోని హుబ్బళ్లి నైరుత్య డివిజనల్ రైల్వే అధికారులకు మైసూరు-అజ్మీర్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో బాంబు అమర్చినట్లు బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడంతో కలకలం రేగింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. వెంటనే బెళగావి సమీపంలోని డేసూరు రైల్వే స్టేషన్లో స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపివేసి పోలీసులు, బాంబు స్క్వాడ్ అధికారులు పెద్ద సంఖ్యలో మోహరించి సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబులు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈసందర్భంగా రైలులోని ఒక బోగీలో రెండు నకిలీ గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఉత్తుత్తి బాంబు ఫోన్ కాల్ బెళగావిలో తీవ్ర కలకలం రేపింది. బాంబు కలకలంతో సుమారు రెండు గంటల పాటు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి వేయడంతో బెళగావి మీదుగా వెళ్లాల్సిన అన్ని రైళ్ల రాకపోకలు ఎక్కడివక్కడ ఆపి వేశారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బుధవారం మధ్యాహ్నం బాంబు అమర్చామంటూ వచ్చిన అపరిచిత వ్యక్తి చేసిన కాల్‌తో భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. డాగ్ స్వ్కాడ్, బాంబు స్క్వాడ్‌తో స్టేషన్లో ప్రయాణికుల లగేజితోపాటు అణువణువూ శోధిస్తున్నారు. -
సిటీ సెక్యూరిటీ వింగ్‌కి రూ.110 కోట్లు
డెప్యుటేషన్‌పై 494 మంది పోలీసులు ప్రత్యేక భవనం అన్వేషణలో కమిషనరేట్ పోలీసులు ఏడాదిలో పూర్తిస్థాయిలో ఏర్పాటు! బాంబ్ స్క్వాడ్ నుంచి అధునాతన పరికరాల వరకు వీఐపీల భద్రతే ప్రధాన అజెండాగా కార్యకలాపాలు విజయవాడ : సీఎం సహా వీవీఐపీలు, వీఐపీల భద్రతే లక్ష్యంగా సిటీ సెక్యూరిటీ వింగ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న కొత్త పోలీసు రక్షక దళానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో 583 మంది సిబ్బందితో ఏర్పాటుకానున్న ఈ వింగ్ భవిష్యత్తు అవసరాలకనుగుణంగా మరింత విస్తరించనుంది. భద్రతకు అవసరమయ్యే అధునాతన పరికరాలతో పాటు వీవీఐపీల కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా సమకూరనున్నాయి. కొత్త భవనం, పరికరాల ఏర్పాటు కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. డెప్యుటేషన్ పైనే... ఈ వింగ్‌కి కేటాయించిన సబ్బందిలో డీసీపీ కేడర్ నుంచి ఎస్ఐ కేడర్ వరకు సిబ్బంది అంతా ఇతర రేంజిలు, ఏఆర్, వివిధ బెటాలియన్ల నుంచి బదిలీపై మరో నెలరోజుల వ్యవధిలో రానున్నారు. మిగిలిన 494 మంది కానిస్టేబుళ్లను ఇతర జిల్లాలు, బెటాలియన్ల నుంచి డెప్యుటేషన్‌పై తీసుకోనున్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉండటమే దీనికి కారణం. ఇప్పటికే వీరిని పంపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సిబ్బంది వచ్చేలోపు తాత్కాలిక భవన అన్వేషణలో కమిషనరేట్ అధికారులు నిమగ్నమయ్యారు. ఏఆర్ గ్రౌండ్స్, కమిషనర్ ప్రాంగణంలో ఉన్న భవనాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నూతన కార్యాలయంలో డీసీపీ చాంబర్‌తో పాటు ఏడీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, మిగిలిన సిబ్బందికి కార్యాలయం, ఐటీ వింగ్‌కు ప్రత్యేకంగా ఒక చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవనానికి రూ.10 కోట్లు, అధునాతన పరికరాల కొనుగోలుకు మిగిలిన రూ.100 కోట్లు కేటాయించనున్నారు. వీటిలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు, బాంబు స్క్వాడ్, డిస్పోజల్ టీమ్స్, యాంటీ సెర్చ్ టచ్ సెల్, రోప్ పార్టీ, డాగ్ స్క్వాడ్, స్లిపర్ డాగ్ స్క్వాడ్, అడ్వాన్స్డ్ టీమ్స్, ఏఎస్ఎల్ టీమ్స్, కంట్రోల్ రూమ్ తదితరాలు ఏర్పాటు కానున్నాయి. అమరావతిలో మరింత విస్తరణ మరో ఏడాది కాలవ్యవధిలో ఏర్పాటు కానున్న అమరావతి కమిషనరేట్ అవసరాల దృష్ట్యా రెట్టింపు స్థాయిలో విస్తరణ జరగనుంది. అమరావతి కమిషనరేట్ ఏర్పాటయ్యేలోగా విజయవాడలో సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేసి మెరుగైన ఫలితాలు రాబట్టాలని నిర్ణయించారు. వింగ్‌లోని సిబ్బం దికి వివిధ అంశాలపై నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వింగ్ పూర్తిగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో సమన్వయం చేసుకొని పనిచేయనుంది. -
ఎన్ఎఫ్సీ కి బాంబు బెదిరింపు
కుషాయిగూడలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పొరేషన్(ఎన్ఎఫ్సీ) కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. సంస్థ ప్రధాన కార్యాలయంలో బాంబు పెట్టామంటూ గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడి వారిని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అణువణువూ గాలిస్తున్నారు. -
అమీర్‌పేట మైత్రీవనం వద్ద బాంబు కలకలం
ఎప్పుడూ సందడిగా ఉండే అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్‌కేసు అనుమానాస్పద పరిస్థితులలో కనిపిచండంతో అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాస్‌పోర్ట్ ఆపీసు ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్‌వద్ద పడిఉన్న సూట్‌కేస్‌ను బాంబు స్వ్కాడ్ తెరిచి చూడగా అందులో ల్యాప్‌టాప్, చార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు మాత్రం ఉన్నాయి. పాస్‌పోర్ట్ పనిమీద వచ్చిన ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సూట్‌కేస్ బాంబు ఉందని ప్రచారం జరగడంతో పాస్‌పార్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని స్క్వాడ్ సభ్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబుస్వ్కాడ్ వచ్చి సూట్ కేసును తెరిచి చూసే వరకూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. -
వామ్మో.. అట్టపెట్టె
- తీవ్ర ఉత్కంఠతో బాంబు స్వ్కాడ్ తనిఖీలు - బయటపడ్డ రాగి చెంబు కడప అర్బన్: కడప నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం సమీపంలో గోడ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన అట్ట పెట్టె సోమవారం రాత్రి కలకలం రేపింది. రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యలో డయల్ యువర్ 100 నెంబరుకు ఫోన్ చేసి ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం సమీపంలో ఓ అట్ట పెట్టె సీల్ చేసి ఉందని సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ కె.రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అట్ట పెట్టె నుంచి వరిపొట్టు రాలుతుండటంతో వెంటనే బాంబు స్వ్కాడ్‌ను రప్పించారు. మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేస్తే పాజిటివ్ శబ్ధం రావడంతో మరింత అనుమానం పెరిగింది. జాగ్రత్తగా అట్ట పెట్టెను తెరిచారు. లోపల కాగితాలు, దూదితో చుట్టిఉన్న ఓ వస్తువు బయటపడింది. దూదిని తొలగించి చూడగా నల్లటి పేపర్ కవరింగ్‌తో ఓ రాగి చెంబు బయటపడింది. లోపల ఓ పేపరుపై 89784 85881 అనే నెంబరుతో పాటు అర్కట వేముల రవి, అర్కట వేముల జయపాల్, రాంగోపాల్ వర్మ, ఇందిరానగర్ అని పేర్లు రాసి ఉన్నాయి. దీనిపై ఆరా తీస్తామని సీఐ తెలిపారు. -
బాంబు కలకలం
వికారాబాద్: గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేస్టేషన్లలో, రైళ్లలో బాంబులు పెట్టామని సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఉదయం 1:30 గంటల నుంచి జాగిలాలతో వికారాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో జాగిలాలు, బాంబ్‌స్క్వాడ్‌తో త నిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని వాడీ, బీదర్ వరకు అన్ని రైల్వేస్టేషన్లలో, ఫ్లాట్‌ఫాంలలో క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు సుమారుగా రెండు గంటల పాటు సాగాయి. పోలీసులు అనుమానిత వస్తువులు, అనుమానితులను తనిఖీ చేశారు. వికారాబాద్ రైల్వే జంక్షన్లో ఆర్పీఎఫ్ సీఐ ర మేష్చందర్రెడ్డి, జీఆర్పీ ఎస్ఐ తిరుపతి, స్థానిక డీఎస్పీ స్వామి, సీఐ రవి,ఎస్ఐలు శేఖర్,నాగరాజు బాంబుస్కాడ్ సిబ్బంది, జాగిలాలతో పరిశీలించారు. ఎట్టకేలకు ఆకతాయి సమాచారం అని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
రైలుకు తప్పిన పెను ముప్పు
ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి ఏకంగా ఓ రైలునే పేల్చేయాలనుకున్న మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జార్ఖండ్‌లోని రైల్వే ట్రాక్‌పై మావోయిస్టులు అమర్చిన 5 కిలోల పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్ గుర్తించింది. దాంతో వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు. ముందుగానే బాంబులు పెట్టిన విషయాన్ని గుర్తించి, దాన్ని తీసేయడంతో.. ఆ మార్గంలో ప్రయాణించే రైలుకు పెను ప్రమాదం తప్పింది. లేనిపక్షంలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించేదని అన్నారు. -
తిరుమలలో బాంబుల కలకలం
తిరుమల, తిరుపతిలలో బాంబుల కలకలం చెలరేగింది. దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలలో పలుచోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, యాత్రికుల సముదాయాల్లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు. అలిపిరి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో బాంబు స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేశారు. నాలుగు బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేస్తున్నట్లు అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ కర్ణాటక నుంచి వచ్చిందని, ఆ ఫోన్ కాల్ ఆధారంగా తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
పోలీస్ జాగిలాలకు ‘స్మారకం’
సాక్షి, ముంబై: బాంబ్ స్క్వాడ్‌లో పనిచేసి మృతి చెందిన జాగిలాలకు స్మారకాన్ని ఏర్పాటుచేయాలని బెస్ట్ సమితి మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ‘జంజీర్’ జాగిలం 2006లో మృతి చెందింది. దాని సేవలకు గుర్తుగా వాళ్కేశ్వర్లోని కమలానెహ్రూ పార్క్‌లో స్మారకం నిర్మించేందుకు అప్పట్లో తీర్మానించారు. గట్ నాయకుల సమావేశంలో ఈ స్మారక నిర్మాణానికి మంజూరు కూడా లభించింది. అనంతరం అనుమతి కోసం ప్రతిపాదనను హోంశాఖకు పంపించారు. అయితే ఇప్పటివరకు దానికి ఆమోదముద్ర లభించలేదు. ఇదిలా ఉండగా, మూడు రోజుల కిందట ‘ప్రిన్స్’ అనే పోలీస్ జాగిలం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు శునకాలకు కలిపి ఒకే చోట స్మారకం నిర్మించాలని సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు. -
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
ఆట ఆరంభం సినిమాలో హీరో అజిత్ బాంబు నిర్వీర్య దళం నిపుణుడు. అలాంటి అజిత్ ఇంటికే శనివారం నాడు ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 'తాళ 55' షూటింగులో అజిత్ బిజీగా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి, ఆ ఇంట్లో బాంబు ఉందని బెదిరించాడు. దాంతో బాంబుస్క్వాడ్ ఆయన ఇంటికి హుటాహుటిన చేరుకుని వెంటనే అక్కడ అణువణువూ గాలించింది. అయితే, ఎలాంటి బాంబు లేకపోవడంతో అది ఉత్తుత్త కాల్ మాత్రమేనని తేలింది. అయితే, ఈ బెదిరింపు రావడానికి కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. పోలీసులు ఆ ఫోన్ చేసిందెవరో తేల్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని భరత్ అనే పాత్రికేయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''ఈసీఆర్‌లోని అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు బాంబుస్క్వాడ్ మొత్తం పరిసరాలను గాలించింది. అది ఉత్తుత్త కాల్ అని తేలింది'' అని భరత్ ట్వీట్ చేశారు. -
బీజేపీ ఆఫీస్ వద్ద బ్యాగుల కలకలం
-
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద బ్యాగుల కలకలం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం అనుమానాస్పద బ్యాగులు కలకలం రేపాయి. కార్యాలయం గేట్ వద్ద మూడు బ్యాగ్‌లను సెక్యూరిటీ సిబ్బంది కనుగొన్నారు. దాంతో అప్రమత్తమైన వారు బాంబ్, డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కాగా ఆ బ్యాగ్‌లు తామవేనంటూ ఓ యువతి అక్కడకు రావటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము నరేంద్ర మోడీని చూసేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయంకు వచ్చినట్లు ఆమె తెలిపింది. అయితే బ్యాగ్‌లు అక్కడ వదిలి ఎక్కడకు వెళ్లారనే దానిపై సమాచారం లేదు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా బ్యాగులు తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేనట్లు సమాచారం. మరోవైపు నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన కాసేపు భద్రతా అధికారులను ఉరుకులు పరుగులు తీయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేంద్ర మంత్రి కారు కింద బాంబు
-
కేంద్ర మంత్రి కారు కింద బాంబు!
యానాం, న్యూస్‌లైన్/పుదుచ్చేరి: కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద శక్తిమంతమైన పైపు బాంబు బయటపడింది. బుధవారం వేకువజామున పుదుచ్చేరి ఎలైమనన్ కోయిల్ వీధిలోని ఆయన ఇంటి బయట నిలిపి ఉంచిన కారు అడుగున ఇది కనిపించింది. దీన్ని గమనించిన కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. రెండు వైపులా మూసేసి, రెండు వైర్లు తగిలించి ఉన్న గొట్టంలాంటి ఆ బాంబును తమిళనాడు పోలీసు విభాగానికి చెందిన బాంబ్‌స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. కేజీన్నర బరువున్న ఈ బాంబుకు చిన్నచిన్న ఎలక్ట్రికల్, నాన్-ఎలక్ట్రికల్ డిటోనేటర్లు అమర్చారని పోలీసులు తెలిపారు. ఇది పేలి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని అన్నారు. ఈ ఉదంతంపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీజీపీ కామ్రాజ్ చెప్పారు. ఈ సంఘటన తర్వాత మంత్రి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంత్రి నారాయణసామి మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో అసాంఘిక శక్తులు విజంభిస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. బాంబు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.