సాక్షి, ముంబై: బాంబ్ స్క్వాడ్‌లో పనిచేసి మృతి చెందిన జాగిలాలకు స్మారకాన్ని ఏర్పాటుచేయాలని బెస్ట్ సమితి మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ‘జంజీర్’ జాగిలం 2006లో మృతి చెందింది. దాని సేవలకు గుర్తుగా వాళ్కేశ్వర్‌లోని కమలానెహ్రూ పార్క్‌లో స్మారకం నిర్మించేందుకు అప్పట్లో తీర్మానించారు.
గట్ నాయకుల సమావేశంలో ఈ స్మారక నిర్మాణానికి మంజూరు కూడా లభించింది. అనంతరం అనుమతి కోసం ప్రతిపాదనను హోంశాఖకు పంపించారు. అయితే ఇప్పటివరకు దానికి ఆమోదముద్ర లభించలేదు. ఇదిలా ఉండగా, మూడు రోజుల కిందట ‘ప్రిన్స్’ అనే పోలీస్ జాగిలం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు శునకాలకు కలిపి ఒకే చోట స్మారకం నిర్మించాలని సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు.
పోలీస్ జాగిలాలకు ‘స్మారకం’
Published Mon, Nov 24 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement