monument
-
164 ఏళ్ల లోకల్ హీరో వీరగాథ; నడిబజారులో ఉరికంబానికి
సాక్షి,హైదరాబాద్: జూలై 17..సాయంత్రం ఆరున్నర..అసురసంధ్య వేళ భాగ్యనగరం పుత్లీబౌలి ప్రాంతంలో అలికిడి మొదలైంది. దాదాపు 500 మంది యువకులు రహస్యంగా ఓ చోటకు చేరారు. వారికి తురేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌లు నాయకత్వం వహిస్తున్నారు. నెమ్మదిగా ముందుకు సాగి బ్రిటిష్ రెసిడెన్సీ గేటుకు సమీపంలో ఉన్న రెండు ఇళ్లలోకి చేరారు. అక్కడి నుంచి తమ పరిమిత ఆయుధ సంపత్తితో రెసిడెన్సీపై దాడి ప్రారంభించారు. చిన్నదిగా ఉన్న గోడను కొంతమేర కూల్చి లోనికి చొరబడ్డారు. వారి లక్ష్యం ఒక్కటే..లోపల బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వెంటతీసుకెళ్లాలి. కానీ మద్రాసు హార్స్ ఆర్టిలరీ శిక్షణ పొందిన బ్రిటిష్ సైన్యం ముందు ఆ యువకులు నిలవలేకపోయారు. దాడి విఫలమైంది. చివరకు నిజాం ప్రభుత్వమే వారి జాడను బ్రిటిష్ సైన్యానికి అందించి వారికి మరణశాసనం లిఖించింది. సిపాయి తిరుగుబాటు చరిత్రలో సగర్వంగా నిలవాల్సిన భాగ్యనగర పుటకు ప్రాధాన్యం లేకుండా పోయింది. వారి వీరగాథకు ప్రచారం రాకుండా నాటి నిజాం ప్రభుత్వమే అణచివేసిందనేది చరిత్రకారుల మాట. సరిగ్గా 164 ఏళ్ల క్రితం నాటి లోకల్ హీరో వీరగాథ ఇది ఇది కోఠి కూడలిలో ఉమెన్స్ కాలేజీ గోడనానుకుని నిర్మితమైన ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉన్న స్మారకం, కనిపించినా ఇదేంటో కొందరు చరిత్రకారులకు తప్ప ఎవరికీ తెలియని నిర్మాణం.. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి పౌరుషాన్ని అద్దిన సిపాయి తిరుగుబాటుతో హైదరాబాద్‌కు ముడిపడిన ఓ వీరగాథకు సజీవసాక్ష్యం ఇది. ఎవరీ తరేబాజ్ఖాన్? బ్రిటిష్ వారి ఆగడాలు మితిమీరిపోతుండటం, తన ఉనికిని కాపాడుకునే క్రమంలో నాటి నిజాం పాలకులు సాగిలపడిపోవటం.. కొందరు పౌరుల్లో అసహనాన్ని పెంచింది. అలాంటి అభిప్రాయంతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించిన జమేదార్ చీదాఖాన్‌ను బ్రిటిష్ సైన్యం అరెస్టు చేసి ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీ భవనంగా ఉన్న నాటి బ్రిటిష్ రెసిడెన్సీలో ఖైదు చేసింది. ఈ విషయం తెలిసి బేగంబజార్‌కు చెందిన ఓ సాధారణ సిపాయి తురేబాజ్ఖాన్లో ఆగ్రహాన్ని నింపింది. ఇతనిలాగే రగిలిపోతున్న మౌల్వీ అల్లావుద్దీన్‌తో కలిసి తిరుగుబాటుకు పథకం రచించాడు. 1857 జూలై 17న 500 మంది యువకులతో బ్రిటిష్ రెసిడెన్సీ నోడ వద్ద ఉన్న రెండు ఇళ్లలోకి చేరి గోడ కూల్చి లోనికి చొరబడి బ్రిటిష్ సైన్యంపై దాడి ప్రారంభించారు. కానీ ఈ దాడి గురించి ముందుగానే వేగుల ద్వారా తెలుసుకున్న నిజాం ప్రభుత్వ మంత్రి తురబ్ అలీఖాన్ దాడి సమాచారాన్ని బ్రిటిష్ సైన్యానికి చేరవేశారు. దీంతో తురేబాజ్ ఖాన్ గెరిల్లా పోరాటం ఎక్కువసేపు సాగలేదు. సుశిక్షితులైన బ్రిటిష్ సిబ్బంది ముందు నిలవలేక..మరోసారి పెద్ద ఎత్తున దాడి చేద్దామని నిర్ణయించి అంతా పారిపోయారు. తురేబాజ్, అల్లావుద్దీన్‌ల ఆచూకీని నిజాం మంత్రి అలీఖాన్ బ్రిటిష్ సైన్యానికి చేరవేయడంతో వారిని పట్టుకుని అండమాన్ తరలించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా తురేబాజ్ను హైదరాబాద్ తరలించి బ్రిటిష్ రెసిడెన్సీ ముందు నడిరోడ్డుపై ఉరి తీసి రోజంతా శవాన్ని అలాగే ఉంచారు. ఇప్పుడు అదే చోట స్మారకం ఉంది. ఆయన అండమాన్ నుంచి తప్పించుకుని మళ్లీ పోరాటానికి పథకం సిద్ధం చేసే ప్రయత్నంలో ఉండగా, నిజాం ప్రభుత్వం గుర్తించి బ్రిటిష్ సైన్యంకు పట్టించిందని, 1858 జనవరిలో ఆయనను కాల్చి చంపారన్న మరో కథ కూడా ఉంది. -
చేతిలో చెయ్యేసి
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో చల్లని సాయంత్రం సమయంలో చిరుగాలులు మోముని తాకుతూ ఉంటే తన నెచ్చెలి మెలానియా చేతిలో చెయ్యేసి వెండికొండలా మెరిసిపోయే ప్రపంచ అద్భుతాన్ని తనివితీరా చూసి తన్మయత్వం చెందారు అగ్రరాజ్యాధీశుడు ఆగ్రా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి ప్రఖ్యాతివహించింది. తాజ్‌మహల్‌ని సందర్శించడమంటే అదో అద్భుతమైన ప్రేమ భావన. అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో ‘‘తాజమహల్ వావ్ అనిపించింది. సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌లో గంటకు పైగా కలియతిరుగుతూ అణువణువు సౌందర్యంతో నిండిపోయిన ఆ కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన తాజ్‌మహల్ గొప్పతనాన్ని ఒక గైడ్ వారికి వివరించి చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఇతర ప్రతినిధుల బృందంతో పాటు వారు దూరం నుంచి తాజ్‌మహల్ అందాలను వీక్షించారు. తాజ్ అందాలను ఇవాంకా తన మొబైల్ ఫోన్లో బంధిస్తూ కనిపించారు. ఆగ్రా వీధుల్లో ఘన స్వాగతం అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆగ్రా ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా ట్రంప్ కారు బీస్ట్ క్షణ కాలమైనా కనిపిస్తుందని ఆత్రుతగా ఎదురుచూశారు. అహ్మదాబాద్ నుంచి ఆగ్రాలో ఖేరియా ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఆయనకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తాజ్‌మహల్‌కి సమీపంలోని ఓబరాయ్ అమర్‌విలాస్ హోటల్‌కి తన కాన్వాయ్‌లోనే చేరుకున్నారు. మొత్తం 13కి.మీ. దూరం ఉన్న ఈ ప్రయాణంలో 15 వేలకు మందికి పైగా విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్డుకిరువైపులా అమెరికా, భారత్ జెండాలు పట్టుకొని ఉత్సాహంతో చేతులు ఊపారు. ఆ హోటల్ నుంచి తాజ్‌మహల్‌కి తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లో వెళ్లారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాజ్‌మహల్ గేటు నుంచి 500 మీ పరిధి వరకు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ తన బీస్ట్ కారుని హోటల్ ఆవరణలో ఉంచి ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లోనే వెళ్లారు. తాజ్ కట్టడం దగ్గర మెలానియాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు వస్తూ ఉండడంతో తాజ్‌ని అద్దంలా ఉంచడానికి మరింత మెరుగులు దిద్దారు. వందలాది మంది పనివాళ్లు ముల్తానీ మిట్టీతో తాజ్‌ని శుభ్రం చేశారు. తాజ్‌మహల్‌ని సందర్శించిన అధ్యక్షుల్లో చివరి వాడు బిల్ క్లింటన్. 2000 సంవత్సరంలో తన కుమార్తె చెల్సీతో కలిసి ఆయన తాజ్‌ని సందర్శించారు. 2015లో బరాక్ ఒబామా తాజ్‌ని చూద్దామని భావించారు కానీ, భద్రతా కారణాల రీత్యా సందర్శించలేదు. ఇవాంకా మళ్లీ అదే డ్రెస్ సాధారణంగా సెలిబ్రిటీలు ఒకసారి వేసుకున్న డ్రెస్‌తో మళ్లీ బయట ప్రపంచానికి కనిపించరు. పూటకో ఫ్యాషన్‌తో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు. కానీ ఇవాంకా గత ఏడాది ఫ్యాషన్‌నే మళ్లీ కొనసాగించారు. 2019 సెప్టెంబర్ అర్జెంటీనా పర్యటనలో ఏ మిడీ అయితే వేసుకున్నారో అదే మళ్లీ భారత పర్యటనలోనూ ధరించారు. బేబి బ్లూ రంగు పైన ఎరుపు రంగు పెద్ద పెద్ద పువ్వులున్న వీ నెక్ డ్రెస్ వేసుకున్నారు. ఇలా మళ్లీ అదే డ్రెస్ వేసుకోవడానికీ ఒక కారణం ఉంది. ఒక చిన్న వస్త్రం తయారు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో సహజవనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజవనరుల్ని కాపాడాలంటే సెలిబ్రిటీలు కూడా వేసుకున్న డ్రెస్‌లే మళ్లీ ధరించాలన్న సందేశాన్ని పంపడానికే ఇవాంకా అదే డ్రెస్ ధరించారు. ఈ విధంగా ప్రకృతి పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజ్ వద్ద ఇవాంకా, కుష్నర్ దంపతులు సాధారణ టూరిస్టులకు నో ట్రంప్ రాక సందర్భంగా సోమవారం ఆగ్రాలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహల్‌లో సాధారణ టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ట్రంప్ తాజ్‌మహల్ రాగా.. ఉదయం 11.30 గంటలకే తాజ్‌ను సాధారణ సందర్శకులకు దూరం చేశారు. ట్రంప్ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ రాకను పురస్కరించుకుని తాజ్‌మహల్‌ను అందం గా అలంకరించామని, ఉద్యానవనంలో మరిన్ని పూలమొక్కలు నాటడంతోపాటు ఫౌంటేన్లు మరమ్మతు చేయించామన్నారు. ట్రంప్ దంపతులకు సీఎం యోగి బహుమతి -
సరికొత్త చరిత్రకు గురుతు విజయ స్థూపం
ఇచ్ఛాపురం రూరల్: సరికొత్త చరి త్రకు విజయ స్థూపం (పైలాన్) మరుపురాని గుర్తుగా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా మండలం లొద్దపుట్టి వద్ద నిర్మితమవుతున్న విజయ స్థూపాన్ని ఆదివారం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈ నెల 9న అధినేత వైఎస్ జగన్మోహన్ చేతులు మీదుగా ప్రారంభించబోయే విజయ స్థూపం, బహిరంగ సభకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ కార్యకర్తలతో చర్చించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, వైఎస్సార్సీపీ నేత కాయల వెంకటరెడ్డి, ఆశి పురుషోత్తమరెడ్డి, పిలక దేవరాజు, సాడి శ్యామ్‌ప్రసాద్, ప్రకాష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తాజ్‌మహల్ రంగు మారుతోంది..
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలోని చారిత్రక తాజ్‌మహల్ రంగు మారిపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆందోళనం వ్యక్తం చేసింది. గతంలో పసుపువర్ణంలో మెరిసే ఈ కట్టడం క్రమంగా గోధుమ, ఆకుపచ్చ వర్ణంలోకి మారుతోందని పేర్కొంది. తాజ్‌మహల్‌కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం తక్షణమే భారత, విదేశీ నిపుణుల సాయం తీసుకోవాలని, ఆ తర్వాతే చారిత్రక కట్టడం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. ‘మన వద్ద చారిత్రక కట్టడాలను పరిరక్షించే నైపుణ్యం ఉందో లేదో మాకు తెలియదు..మీ వద్ద ఆ నైపుణ్యం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు..లేదా దానిపై మీకు (ప్రభుత్వం) శ్రద్ధ కొరవడింద’ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. భారత్ వెలుపల విదేశీ నిపుణుల సలహాలు అవసరమైనా తక్షణమే తీసుకోవాలి..లేకుంటే తాజ్ మహల్‌కు మరింత నష్టం వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. తాజ్ మహల్ రంగు ఎందుకు మారుతోందని పిటిషనర్ ఎంసీ మెహతా సమర్పించిన ఫోటోలను చూపుతూ కోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని ప్రశ్నించింది. తాజ్ మహల్ పర్యవేక్షణను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టాలని అన్నారు. అనంతరం ఈ అంశంపై విచారణను మే 9కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్‌మహల్‌ను కాలుష్య కోరల నుంచి కాపాడాలని పర్యావరణవేత్త మెహతా సుప్రీంలో పిటిసన్ దాఖలు చేశారు. -
శివాజీ స్మారకానికి మోదీ జలపూజ
-
శివాజీ స్మారకానికి మోదీ జలపూజ
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాలు ♦ ముంబై తీరానికి 1.5 కి.మీ. దూరంలో ఏర్పాటు ముంబై: ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ స్మారక ( ఎత్తు192 మీటర్లు) నిర్మాణానికి శనివారం ప్రధాని మోదీ జలపూజ చేశారు. దక్షిణ ముంబైలోని తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600కోట్లతో ఈ స్మారకాన్ని నిర్మించనున్నారు. గిరుగావ్ చౌపట్టి బీచ్ నుంచి హోవర్‌క్రాఫ్ట్ (కోస్టుగార్డు ప్రత్యేక నౌక)లో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జలపూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాలనుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన నీరు నింపిన కలశాలను మోదీ సముద్రంలో విసర్జనం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతోపాటు ఛత్రపతి శివాజీ వారసులు ఉదయన్ రాజే, శంభాజీ రాజే (ఇద్దరూ ఎంపీలే) మోదీతో పాటు హోవర్‌క్రాఫ్ట్‌లో వెళ్లారు. ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి. శివాజీ స్మారకానికి శంకుస్థాపన చేయటం నా అదృష్టం. అందరూ శివాజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తర్వాత జరిగిన కార్యక్రమంలో మోదీ అన్నారు. అనంతరం లక్షా ఆరు వేల కోట్లతో ముంబై డీఎన్ నగర్– బీకేసీ–మాన్ ఖుర్ద్ (మెట్రో–2), వడాల–ఘట్కోపర్–ములుండ్– థానే–కాసార్ వడవలి (మెట్రో–4) తదితర కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. -
మిర్యాలగూడలో శిలాఫలకాలు ధ్వంసం
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. శిలా ఫలకాలు ధ్వంసమైన విషయాన్ని గమనించిన దళితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
స్మృతి ఒక నివాళి
జీవన కాలమ్ అన్ని సాహితీ ప్రక్రియలలోనూ అనితరసాధ్యమైన ప్రతిభను కనపరిచిన మహా మేరు శృంగం, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారి ఇల్లు విజయవాడలో ఉంది. దాన్ని స్మారక చిహ్నాన్ని చేసి జాతికి సమర్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం మైసూరులో ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ ఇంటిని కొనుగోలు చేసి స్మారక భవనంగా తీర్చిదిద్దు తోంది. గురజాడ విజయనగరంలో బొంకుల దిబ్బనీ, థామస్ హార్డీ ఇంగ్లండ్‌లో ‘ససెక్స్’నీ, ఆర్.కె. నారాయణ్ ‘మాల్గుడి’నీ సాహిత్యం లో సుప్రతిష్టితం చేశారు, తమ కళాఖండాల ద్వారా. మొన్న- హైదరాబాదులో అనుకుం టాను, ‘మాల్గుడి’ అనే షాపు పేరు చూశా ను. ఒక రచయిత కృషికి అది నివాళి. లండన్ బేకర్ స్ట్రీట్ స్టేషన్లో దిగగానే- గోడమీద కనిపించేది షెర్లాక్‌హోమ్స్ పాత్ర బొమ్మ. రచయిత ఆర్థర్ కోనన్ డాయిల్ తన నవలలో సృష్టించిన షెర్లాక్ హోమ్స్ అడ్రసు 221 బి-బేకర్ స్ట్రీట్ అని చెప్పారు. వాస్తవానికి అది అతని నివాసం కాదు. కాని ఇప్పుడది స్మృతి చిహ్నం. నేను వెదుక్కుంటూ వెళ్లాను. షెర్లాక్ హోమ్స్‌కి సంబంధించిన పుస్తకాలు, వస్తువులతో అది ఒక స్మారక మందిరమయింది. జర్మనీలో కొలోన్ అనే ఊరిలో ఓ చిన్న సందులో ఉన్న ఓ చిన్న ఇంటికి వెళ్లాను. అది ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బితోవెన్ ఇల్లు. ఆయన గది, వస్తువులు, ప్రపంచ ప్రసిద్ధమైన 12వ సంఫనీని రచిం చిన పియానో - అన్నీ ఉన్నాయి. ఆయన ఫొటోలు న్నాయి. నిద్రించిన మంచం ఉంది. చూసి ఆయన సమ క్షంలోనే ఉన్నట్టు పులకించాను. వీధి దాటి వచ్చాక- చిన్న పార్కులో ఒక పోక చెట్టు కింద పియానో పెట్టుకుని పిల్లలు పెట్టిన కోటుతో ఒక పేద కళాకారుడు బితోవెన్ సంగీతాన్ని వాయిస్తు న్నాడు. మరో చెట్టుకింద నిలబడి మరో పేద కళాకా రిణి వయొలిన్ వాయిస్తోంది. వారి ముందు పరిచిన చదర. నిలబడి చూస్తున్నవాళ్లు తోచిన పైకాన్ని వేస్తు న్నారు. పేదరికం-ఇంత హుందాగా, సంపన్నంగా, ఉదాత్తంగా ఉంటుందా అనిపించింది. ఇంగ్లండ్‌లో స్టాట్ఫర్డ్లో దాదాపు 445 సంవత్స రాల నాటి షేక్స్పియర్ ఇల్లు ఉంది. శతాబ్దాలు గడి చినా ఆయా వస్తువులు చెడిపోకుండా శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఉంచారు. ఆ ఇంట్లో నడుస్తున్నంత సేపూ ఒళ్లు పులకించింది. ఎన్ని జ్ఞాపకాలు- ఎన్ని పాత్రలు- హామ్లెట్, కింగ్ లియర్, హెన్రీ ఠి, ఒథెల్లో, క్లియొ పాత్రా, షైలాక్, ఒఫీలియా- ఎన్నో ఎన్నో! అమెరికా జాక్సన్విలీలో మొట్టమొదటిసారిగా పీడిత ప్రజల హక్కులను పరిరక్షించడానికి కంకణం కట్టుకున్న అబ్రహాం లింకన్ ఇంటిని దర్శించాం. అలాగే కెంట్‌లో చార్లెస్ డికెన్స్ ఇల్లు. తమిళనాడు తిరు వారూర్లో త్యాగరాజు, దీక్షితార్, శ్యామాశాస్త్రి పుట్టిన ఇళ్లు సంగీత ప్రియులకు పుణ్యక్షేత్రాలు. నేనూ మా ఆవిడా శ్యామాశాస్త్రి ఇంటి వసారాలో కూర్చుని చింతా మణి రాగంలో ‘‘దేవీ, బ్రోవసమయమిదే...’’ పాడు కుని పులకించాం. ఇప్పుడు ఈ కాలమ్‌కి కారణం. తన జీవిత కాలం లో దిషణాహంకారాన్ని హక్కుని చేసుకుని, ఓ ఘన తగా తీర్చిదిద్ది, అన్ని సాహితీ ప్రక్రియలలోనూ అనితర సాధ్యమైన ప్రతిభను కనపరిచిన మహా మేరు శృంగం, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారి ఇల్లు విజయ వాడలో ఉంది. దాన్ని స్మారక చిహ్నాన్ని చేసి జాతికి సమర్పించవలసిన బాధ్యత ప్రభుత్వా నిది. దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఒక సాహితీపీఠం చేయాలి. తెలుగువాడికి పక్కవాడి గొప్పతనాన్ని చూసి గర్వపడడం తెలీదు. ప్రతి తెలుగు వాడూ ఒక ‘ద్వీపం’ అంటాను. మన సంస్కృ తిని మన గతం ప్రతిఫలిస్తుంది. మన సంస్కా రాన్ని వర్తమానం నిర్ణయిస్తుంది. మన భవిష్య త్తుని మన దూరదృష్టి నిర్దేశిస్తుంది. అలనాడు సాహితీప్రియులు మండలి బుద్ధప్రసాద్గారి కృషి ఫలి తంగా విజయనగరంలో గురజాడ స్మారక భవనం వెలసింది.విశ్వనాథ వారి ఒక ఘటన చెప్పి ముగిస్తాను. విజ యవాడలో మండువేసవిలో ఎండ నిప్పులు చెరుగు తున్న రోజున ఆయనా, ఆయన ఆత్మీయ మిత్రులు ధూళిపాళ శ్రీరామమూర్తిగారూ వాల్మీకి రామాయ ణంలో ఋష్యశృంగ వృత్తాంతాన్ని చదువుకుంటు న్నారు. ఉన్నట్టుండి మేఘాలు కమ్మి వర్షం పడింది. ‘‘వేసవిలో వర్షమా?’’ అని ఆశ్చర్యపోయారు ధూళిపాళ. ‘‘ఇందులో ఆశ్చర్యమేముంది పిండాకూడు. మనం చదువుతున్నది ఋష్యశృంగుడి కథ. అది వాల్మీకి మహాత్మ్యం’’ అన్నారట విశ్వనాథ. కొన్ని సీజన్ల తరువాత మరో మండువేసవిలో ధూళిపాళ పరుగున వచ్చారట విశ్వనాథ వారింటికి. ‘‘అయ్యా! చూశారా, వర్షం పడుతోంది!’’ అన్నారట శ్రీరామమూర్తిగారు. ‘‘అయితే ఏమిటట? ’’ అన్నారు విశ్వనాథ. ‘‘మీ కల్పవృక్షానికీ ఆ మహాత్మ్యం ఉందండీ! నేని ప్పుడు కల్పవృక్షంలో ఋష్యశృంగ వృత్తాంతమే చదివి వస్తున్నాను!’’ అన్నారట ధూళిపాళ శ్రీరామమూర్తి గారు. గొల్లపూడి మారుతీరావు -
‘లోపలి మనిషి’ స్మృతిలో...
దేశ రాజధానిగా మాత్రమే కాదు...ఢిల్లీ మహానగరానికి ఇతరత్రా కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి. చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ మహానగరంలో ఘనంగా బతికినవారిని, జీవించినకాలంలో మంచి చేసినవారిని మరణించినంత మాత్రాన మరిచిపోరాదన్న సంస్కారం ఉంది. అందుకే అక్కడ ఏమూలకెళ్లినా ‘మృతజీవులు’ పలకరిస్తారు. వారి సమాధులు దర్శనమిస్తాయి. కనుకే ఆ నగరానికి ‘సమాధుల నగరం’గా కూడా పేరొచ్చింది. దేశ ప్రధానిగా అవిచ్ఛిన్నంగా అయిదేళ్లు పనిచేసి, ఆర్థిక సంస్కరణలతో దేశ గతినే మలుపుతిప్పిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు స్మారక స్థలి ఏర్పాటు చే సేందుకు అలాంటి మహానగరంలో చారెడు నేల దొరకలేదు! బతికుండగా ఆయనను ఎన్నో విధాలుగా అవమానించిన కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీలో ఆయనకు మరణానంతరం స్మృతిచిహ్నం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో... దశాబ్దకాలం తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయనకు సముచిత రీతిలో స్మారక చిహ్నం ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని వెలువడిన కథనం అందరికీ ఊరటనిస్తుంది. పీవీ నరసింహారావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాంగ్రెస్ వాదిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన పీవీ ఆజన్మాంతం అందులోనే కొనసాగారు. 1969లో పార్టీలో వచ్చిన చీలిక మొదలుకొని దేశంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాల్లో ఆయన ఇందిరాగాంధీ వెనక దృఢంగా నిలబడ్డారు. అటు తర్వాత రాజీవ్‌గాంధీకి సైతం బాసటగా ఉన్నారు. వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి వారిద్దరి ప్రశంసలూ పొందారు. ఈ క్రమంలో ఆయన నిర్వహించిన పాత్రపై ప్రత్యర్థి రాజకీయపక్షాలనుంచి విమర్శలు వచ్చి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన మరో విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమై ఉండొచ్చు. కానీ నమ్మినదాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించడం పీవీ విశిష్టత. రాజకీయ రంగంలో మాత్రమే కాదు... సాహిత్య రంగంలో సైతం ఆయన కృషి ఎన్నదగినది. ఆయన బహుభాషా కోవిదుడు. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం వచ్చు. ‘ద ఇన్సైడర్’ (లోపలి మనిషి) వంటి నవల రాయడంతోపాటు విశ్వనాథ వారి వేయిపడగలను హిందీలోకి అనువదించిన పండితుడాయన. ఒకపక్క రాజకీయ రంగంలో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే వీటన్నిటినీ ఆయన కొనసాగించారు. ఇన్ని రంగాల్లో నిష్ణాతుడైన పీవీ వాస్తవానికి రాజకీయ రంగంనుంచి స్వచ్ఛందంగా వైదొలగి తన శేష జీవితాన్ని తనకు ఎంతో ఇష్టమైన సాహితీరంగానికి అంకితం చేద్దామనుకున్నారు. అందుకోసమని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈలోగా ఉగ్రవాద దాడిలో రాజీవ్‌గాంధీ మరణించడంతో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను స్వీకరించడంతోపాటు ప్రధానిగా పనిచేయాల్సివచ్చింది. ఆయన అభీష్టమే నెరవేరి ఉంటే దేశం పీవీ సాహితీ వైశిష్ట్యాన్ని మరింత నిశితంగా చూడగలిగేది. కానీ, ఒక విశ్లేషకుడన్నట్టు ప్రపంచీకరణ విధానాలను ఎంతో చాకచక్యంగా, సమర్థవంతంగా అమలుచేసి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయగలిగిన నాయకుణ్ణి మాత్రం పొందలేకపోయేది. అందులో వాస్తవం ఉంది. ప్రధానిగా పీవీ బాధ్యతలు చేపట్టిన నాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు నిండా రూ. 3,000 కోట్లు కూడా లేవు. ఆయన గద్దె దిగేనాటికి ఆ నిల్వలు 14,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. అప్పటికి ఆర్ధికవేత్తగా మాత్రమే పేరున్న మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా తీసుకురావడం మాత్రమే కాదు... అయిదేళ్లలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలకు రాజకీయంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూశారు. ఆర్థిక సంస్కరణలపై వివిధ వర్గాలనుంచి వచ్చిన విమర్శలకు పీవీయే జవాబిచ్చేవారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ లేని సమయంలోనే ఈ సంస్కరణలను ఆయన జయప్రదంగా అమలుచేయగలిగారు. యూపీఏ పదేళ్ల పాలనాకాలంలో మలి దశ సంస్కరణల అమలుకు ఎన్ని పిల్లిమొగ్గలు వేయాల్సి వచ్చిందో, ఎలాంటి వైఫల్యాలను చవిచూసిందో గమనిస్తే పీవీ గొప్పతనం అవగతమవుతుంది. నెహ్రూ కుటుంబీకులు మినహా మరెవరూ దేశానికి సుస్థిర పాలన అందించలేరన్న వాదనను పీవీ పూర్వపక్షం చేశారు. ఢిల్లీలో మొఘల్ వంశస్తులు మొదలుకొని ఎందరెందరి సమాధులో ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం మహాత్ముడి స్మారక స్థలి మొదలుకొని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, జగ్జీవన్‌రామ్ వరకూ ఎందరివో స్మృతి చిహ్నాలున్నాయి. ఏ పదవీ చేపట్టని సంజయ్‌గాంధీకి కూడా సమాధి ఉంది. కానీ, పీవీకి అక్కడ చోటీయకుండా చేసి కాంగ్రెస్ తన సంస్కారాన్ని బయట పెట్టుకుంది. ఆయనకు సముచిత చిహ్నం నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందాక ఎన్డీయే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నదంటున్నారు. మంచిదే. అయితే, పదిహేనేళ్లక్రితం పీవీపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటికి ఎనిమిదో తరగతి హిందీ రీడర్లో పీవీ నరసింహారావు జీవిత విశేషాలతో ఉన్న ‘భారత్ కే ప్రధాన్‌మంత్రి’ పాఠ్యాంశాన్ని తొలగించిన ఘనత కూడా ఆనాటి తెలుగుదేశం సర్కారుదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గొంతు సవరించుకుని పీవీ స్మారక చిహ్నం నిర్మాణం ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఆయన జీవించి ఉన్నప్పుడుగానీ, మరణించాక ఈ దశాబ్దకాలంలోగానీ పీవీకి తగిన గౌరవం ఎందుకీయలేదన్న విషయంలో మాత్రం సంజాయిషీ ఇవ్వలేదు. అంతేకాదు...ఢిల్లీలో ఇక స్థలం లేదన్న సాకుతో ప్రముఖుల స్మృతి చిహ్నాలకు అనుమతినీయరాదని 2013లో దేన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించారో చెప్పలేదు. సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలిచ్చి నిలబెట్టిన నిరుపమానమైన నేతను సొంతం చేసుకోలేని దీనస్థితిలో కాంగ్రెస్ పడితే... చివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఆయన సేవలను గుర్తించి గౌరవించాల్సివచ్చింది. ఇందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి! -
నెక్లెస్‌రోడ్డులో వెంకటస్వామి స్మారకం
హెచ్ఎండీఏను ఆదేశించిన సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ వివేక్ భేటీ సాక్షి,హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామిని భావితరాలు స్మరించుకునేలా రాజధానిలో స్మారక నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆయన దేశానికి సేవచేసిన దళిత నాయకుడిగా, పేదల కోసం జీవించిన ఉన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం అన్నారు. ఆయన గౌరవాన్ని పెంచే విధంగా స్మారకాన్ని నిర్మిస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కలిసిన సందర్భంగా ఈ అంశంపై అధికారులతో సీఎం మాట్లాడారు. నెక్లెస్‌రోడ్డులో స్థలం సేకరించాలని, సభలు నిర్వహించుకోడానికి వీలుగా నిర్మాణం ఉండాలని, అందులో వెంకటస్వామి విగ్రహం కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు. వచ్చే జయంతిని ఇందులోనే నిర్వహించేలా త్వరగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ కూడా దళితుల కోసం ఎంతో పాటుపడ్డారని, ఆయన చరిత్ర కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంకటస్వామి విషయంలో అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. టీఆర్ఎస్లో చేరిక ఊహాగానాలే: వివేక్ టీఆర్ఎస్లో చేరి వరంగల్ ఎంపీ సీటుకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే టీఆర్ఎస్లో చేరతారా అన్న ప్రశ్నకు బదులివ్వకుండా ముందుకుసాగారు. -
స్ఫూర్తి ప్రదాత రాజ్‌కుమార్
కంఠీరవుడి ప్రేరణతో నేత్రదానానికి సిద్ధమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్ ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితం గడిపారు : చిరంజీవి ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకం ఆవిష్కరణ బెంగళూరు: ‘నేత్రదానం చేసి డాక్టర్ రాజ్‌కుమార్ ఈ సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అదే ప్రేరణతో నేనూ నేత్రదానం చేయడానికి నిర్ణయించుకున్నాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అక్కడికక్కడే నేత్రదానానికి సంబంధించిన సమ్మతి పత్రాలపై ఆయన సంతకం చేశారు. శనివారమిక్కడి కంఠీరవ స్టూడియోలో డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ రాజ్‌కుమార్ వంటి మహోన్నత నటుడిని ఆదర్శనీయ వ్యక్తిగా కీర్తించడంతో పాటు ఆయన ఆదర్శాలను కూడా పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశంలో ఎన్నో లక్షల మంది ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారని, నేత్రదానం వల్ల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాధ్యమవుతుందని, ఇదే సందేశాన్ని రాజ్‌కుమార్ అందించారని తెలిపారు. కన్నడ సాంస్కృతిక రాయబారిగా వెలిగిన ఘనత రాజ్కుమార్కే దక్కుతుందని శ్లాఘించారు. సామాజిక, పౌరాణిక, చరిత్రాత్మక సినిమాలతో పాటు బాండ్ శైలి సినిమాల్లో సైతం రాజ్‌కుమార్ తన అమోఘ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచేఉంటారని అన్నారు. మొదటి, చివరి సంతకం రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్‌స్టార్ రజనీకాంత్ కన్నడ భాషలో అనర్గళంగా రాజ్‌కుమార్ ఘనతను వర్ణించారు. కళా సరస్వతి వరపుత్రుడిగా జన్మించిన రాజ్‌కుమార్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నారని అన్నారు. ‘బేడర కన్నప్ప’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాజ్‌కుమార్ కన్నడ చిత్రసీమను 54 ఏళ్ల పాటు నిర్విరామంగా ఏలారని అన్నారు. భారతీయ చిత్రరంగంలో ఇంత సుదీర్ఘకాలం కథానాయకుడిగా కొనసాగిన మరే వ్యక్తినీ తానింత వరకు చూడలేదని అన్నారు. కనకదాసు, పురందర దాసు, బసవణ్ణ వంటి మహనీయుల పాత్రలతో పాటు రావణాసురుడు, హిరణ్యకసిపుడు వంటి పాత్రల్లో సైతం రాజ్‌కుమార్ అద్భుత నటనా ప్రతిభను కనబరిచారని శ్లాఘించారు. రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని సైతం రజనీ తనదైన శైలిలో అభివర్ణించారు. ‘రాజ్‌కుమార్ వంటి మహానటుడిని వనదేవత కూడా ఓ సారి చూడాలనుకుంది. అందుకే ఆయన్ను తన వద్దకు పిలిపించుకుంది. 108 రోజుల పాటు ఆయన్ను చూసి సంతోషంతో మళ్లీ పంపించేసింది’ అని పేర్కొన్నారు. ‘నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నగరంలోని శని మహాత్ముడి ఆలయం వద్దకు వెళ్లిన సమయంలో డాక్టర్ రాజ్‌కుమార్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను నా జీవితంలో తీసుకున్న మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే. ఆ తర్వాత ఎవ్వరి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోలేదు’ అని రజనీకాంత్ గత స్మృతులను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితమే: చిరంజీవి కన్నడ సినీపరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగినా అత్యంత సాధారణ జీవితం గడిపిన మహావ్యక్తి డాక్టర్ రాజ్‌కుమార్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ‘నేను ఎన్నో సార్లు రాజ్‌కుమార్‌ను కలిశాను. ఎప్పుడు కలిసినా తెలుగులోనే మాట్లాడేవారు. ఆయనకు దేశ, విదేశాల్లో ఎంతో మంది అభిమానులున్నప్పటికీ ఆయనలో ఏ కోశాన గర్వం కనిపించేది కాదు. ఆయనలో ఓ గొప్ప మానవతావాదిని కూడా చూశాను. కర్ణాటక ప్రభుత్వం రాజ్‌కుమార్ స్మారకాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి తెలిపారు. -
పోలీస్ జాగిలాలకు ‘స్మారకం’
సాక్షి, ముంబై: బాంబ్ స్క్వాడ్‌లో పనిచేసి మృతి చెందిన జాగిలాలకు స్మారకాన్ని ఏర్పాటుచేయాలని బెస్ట్ సమితి మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ‘జంజీర్’ జాగిలం 2006లో మృతి చెందింది. దాని సేవలకు గుర్తుగా వాళ్కేశ్వర్లోని కమలానెహ్రూ పార్క్‌లో స్మారకం నిర్మించేందుకు అప్పట్లో తీర్మానించారు. గట్ నాయకుల సమావేశంలో ఈ స్మారక నిర్మాణానికి మంజూరు కూడా లభించింది. అనంతరం అనుమతి కోసం ప్రతిపాదనను హోంశాఖకు పంపించారు. అయితే ఇప్పటివరకు దానికి ఆమోదముద్ర లభించలేదు. ఇదిలా ఉండగా, మూడు రోజుల కిందట ‘ప్రిన్స్’ అనే పోలీస్ జాగిలం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు శునకాలకు కలిపి ఒకే చోట స్మారకం నిర్మించాలని సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు. -
అరెరె.. గిట్లాయె..!
ఇటీవల కమలాపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. అదేరోజు రాత్రి సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఆ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. శిలాఫలకంలో తమ పేర్లు లేవని.. ఆ కార్యక్రమంలో మంత్రి తమను చిన్నచూపు చూశాడనే ఆరోపణలతో విధ్వంసానికి ఒడిగట్టారు. కమలాపూర్ సర్పంచ్ శనిగరం సమ్మయ్య, వైస్ ఎంపీపీ బైరి దశరథంతో పాటు మరో టీఆర్ఎస్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు ఈ ఘటనలో అదుపులోనికి తీసుకున్నారు. మంత్రి సెగ్మెంట్లో ఆయన కనుసన్నల్లోనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసేంత వరకు వెళ్లటం అందరి నోటా చర్చనీయాంశమైంది. మరోవైపు హుజూరాబాద్ ప్రాంత చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ హోదా కోసం ఈటెల మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తనవంతుగా పావులు కదిపారు. ఎన్నికల ముందు హుస్నాబాద్‌కు మంజూరైన రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేయించి కొత్త జీవో తెచ్చారు. ఆగస్టు 14న హుజూరాబాద్‌లో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. నెలరోజుల తర్వాత ఈ ఆర్డీవో కార్యాలయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పాత జీవోను అమలు చేయాలని సూచించింది. హుస్నాబాద్‌లో ఆర్డీవో కార్యాలయం కావాలని సొంత పార్టీ ఎమ్మెల్యే సతీష్‌బాబు, ఆయన తండ్రి, పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు పట్టుబడుతున్నారు. హుజూరాబాద్‌కు ఈ హోదా కల్పించాలని ఈటెల కోరుతున్నారు. ఈ వివాదంలో కోర్టు తీర్పు ఈటెలకు షాక్ ఇచ్చింది. మరోవైపు హుజూరాబాద్ నగర పంచాయతీ చైర్మన్ నియామకం మంత్రిని చు ట్టుముట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన విజయ్‌కుమార్‌ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టి చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేర్పించటం సొంత పార్టీ కౌన్సిలర్లను అయోమయానికి గురిచేసింది. అక్కడ తొమ్మిది మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గెలిచారు. బీసీ జనరల్‌కు కేటాయిం చిన చైర్మన్ సీటుకు నలుగురు కౌన్సిలర్లు పోటీపడ్డారు. ఆ నలుగురిలో సయోధ్య కుదర్చటంలో మంత్రి విఫలమయ్యారు. దీంతో టీఆర్ఎస్లో చేరే ఒప్పందంతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఈ సీటును దక్కించుకున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లను కాద ని, వేరే కౌన్సిలర్‌కు మద్దతిచ్చారనే అపవాదు మంత్రిని వెంటాడుతూనే ఉంది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల రుణమాఫీపై ఈటెల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం లేపాయి. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ అవి అవగాహన లేని మాటలు.. అంటూ వివాదాన్ని తేలిగ్గా కొట్టిపారేయటంతో మంత్రి ఇరుకునపడ్డారు. రాష్ట్ర కేబినేట్లో మన జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో ఈటెల రాజేందర్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సీఎం కుమారుడు కావటంతో రాష్ట్రస్థాయి వ్యవహారాల్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో జిల్లాలోని చర్చనీయాంశాలు.. తక్షణ సమస్యలన్నీ మంత్రి ఈటెల వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో సొంత సెగ్మెంట్లోనే అసంతృప్తి సెగలు ఆయనకు కంట్లో నలుసులా మారుతున్నాయా.. అనే చర్చలు మొదలయ్యాయి.