
విజయ స్థూపాన్ని పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్: సరికొత్త చరి త్రకు విజయ స్థూపం (పైలాన్) మరుపురాని గుర్తుగా మిగిలిపోతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా మండలం లొద్దపుట్టి వద్ద నిర్మితమవుతున్న విజయ స్థూపాన్ని ఆదివారం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈ నెల 9న అధినేత వైఎస్ జగన్‌మోహన్ చేతులు మీదుగా ప్రారంభించబోయే విజయ స్థూపం, బహిరంగ సభకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ కార్యకర్తలతో చర్చించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, వైఎస్సార్‌సీపీ నేత కాయల వెంకటరెడ్డి, ఆశి పురుషోత్తమరెడ్డి, పిలక దేవరాజు, సాడి శ్యామ్‌ప్రసాద్, ప్రకాష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment