Surendra Bagalkar
-
ఎన్నికల లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది!
బీఎంసీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రధానంగా బీజేపీ - శివసేనల మధ్య పలు డివిజన్లలో గెలుపు దోబూచులాడింది. 220వ డివిజన్లో కూడా అలాగే జరిగింది. బీజేపీ తరఫున పోటీ చేసిన పార్టీ అధికార ప్రతినిధి అతుల్ షా, ఆయన ప్రత్యర్థి.. శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర బాగల్కర్ ఇద్దరికీ ఓట్లు సమానంగా వచ్చాయి. దాంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా కూడా ఓట్లు సమానంగానే వచ్చాయి. దాంతో మునిసిపల్ కమిషనర్ సమక్షంలో లాటరీ నిర్వహించగా, ఆ లాటరీ బీజేపీ అభ్యర్థి అతుల్ షాను వరించింది. దాంతో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటంలో బీజేపీ అభ్యర్థిని అదృష్టలక్ష్మి వరించినట్లయింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 227 డివిజన్లకు గాను శివసేన 84, బీజేపీ 82 డివిజన్లలో విజయం సాధించాయి. -
పోలీస్ జాగిలాలకు ‘స్మారకం’
సాక్షి, ముంబై: బాంబ్ స్క్వాడ్‌లో పనిచేసి మృతి చెందిన జాగిలాలకు స్మారకాన్ని ఏర్పాటుచేయాలని బెస్ట్ సమితి మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ‘జంజీర్’ జాగిలం 2006లో మృతి చెందింది. దాని సేవలకు గుర్తుగా వాళ్కేశ్వర్లోని కమలానెహ్రూ పార్క్‌లో స్మారకం నిర్మించేందుకు అప్పట్లో తీర్మానించారు. గట్ నాయకుల సమావేశంలో ఈ స్మారక నిర్మాణానికి మంజూరు కూడా లభించింది. అనంతరం అనుమతి కోసం ప్రతిపాదనను హోంశాఖకు పంపించారు. అయితే ఇప్పటివరకు దానికి ఆమోదముద్ర లభించలేదు. ఇదిలా ఉండగా, మూడు రోజుల కిందట ‘ప్రిన్స్’ అనే పోలీస్ జాగిలం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు శునకాలకు కలిపి ఒకే చోట స్మారకం నిర్మించాలని సురేంద్ర బాగల్కర్ డిమాండ్ చేశారు.