బాంబు కలకలం
వికారాబాద్: గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేస్టేషన్లలో, రైళ్లలో బాంబులు పెట్టామని సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఉదయం 1:30 గంటల నుంచి జాగిలాలతో వికారాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో జాగిలాలు, బాంబ్‌స్క్వాడ్‌తో త నిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని వాడీ, బీదర్ వరకు అన్ని రైల్వేస్టేషన్లలో, ఫ్లాట్‌ఫాంలలో క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు సుమారుగా రెండు గంటల పాటు సాగాయి.
పోలీసులు అనుమానిత వస్తువులు, అనుమానితులను తనిఖీ చేశారు. వికారాబాద్ రైల్వే జంక్షన్‌లో ఆర్‌పీఎఫ్ సీఐ ర మేష్‌చందర్‌రెడ్డి, జీఆర్‌పీ ఎస్‌ఐ తిరుపతి, స్థానిక డీఎస్పీ స్వామి, సీఐ రవి,ఎస్‌ఐలు శేఖర్,నాగరాజు బాంబుస్కాడ్ సిబ్బంది, జాగిలాలతో పరిశీలించారు. ఎట్టకేలకు ఆకతాయి సమాచారం అని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.