unidentified individuals
-
గుప్త నిధుల కోసం తవ్వకాలు
సింహాద్రిపురం : మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నంద్యాలంపల్లె – ముసల్‌రెడ్డిపల్లె రహదారిలో పురాతన కోనేరులో రెండు రోజుల క్రితం గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కసనూరు గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు మహేశ్వరరెడ్డి పొలంలో పురాతన కాలం నాటి కోనేరు ఉంది. దాని పక్కనే ఉన్న పురాతన సత్రాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో గుప్త నిధుల కోసం కోనేటిలో ఉన్న పెద్ద బండరాళ్లను సైతం తొలగించారు. అక్కడ పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
వీరబల్లి: పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన జయపాల్‌రెడ్డి అనే రైతుకు సంబంధించి మూడు ఎకరాలలో మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామ సమీపాన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలిపోయాయని ఆయన రోదించారు. దీంతోపాటు డ్రిప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి చెట్లలో గరిక (గడ్డి) ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రెట్టింపై వ్యాపించాయని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెంచుకున్నామని, పూర్తి స్థాయిలో కాలిపోవడం వల్ల తమ గోడు ఎవరికి తెలుపుకోవాలంటూ వాపోయారు. ఆ చెట్లకు 5 ఏళ్ల వయస్సు కలదని చెప్పాడు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని అందించి, మళ్లీ మొక్కలను నాటుకునేందుకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరాడు. -
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
వీరబల్లి: పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన జయపాల్‌రెడ్డి అనే రైతుకు సంబంధించి మూడు ఎకరాలలో మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామ సమీపాన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలిపోయాయని ఆయన రోదించారు. దీంతోపాటు డ్రిప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి చెట్లలో గరిక (గడ్డి) ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రెట్టింపై వ్యాపించాయని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెంచుకున్నామని, పూర్తి స్థాయిలో కాలిపోవడం వల్ల తమ గోడు ఎవరికి తెలుపుకోవాలంటూ వాపోయారు. ఆ చెట్లకు 5 ఏళ్ల వయస్సు కలదని చెప్పాడు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని అందించి, మళ్లీ మొక్కలను నాటుకునేందుకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరాడు. -
శ్మశానవాటికలో శవాల కలకలం
విచారణ చేపట్టిన పోలీసులు జవహర్‌నగర్ : గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి రెండు మృతదేహాలను స్థానికంగా పూడ్చిపెట్టడం కలకలం లేపింది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం కారులో వచ్చిన నలుగురు రెండు శవాలను జవహర్‌నగర్‌లోని అరుంధతినగర్ శ్మశానవాటికలో పూడ్చి వెళ్లారు. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకన్న శ్మశాన వాటికకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శవాలను తీసుకువచ్చిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. కీసర మండలం నాగారంలో గల మెర్సి హార్వెస్టిం గ్ మిషన్ సొసైటీ వృద్ధాశ్రమంలోని ఇద్దరు అనాథ వృద్ధులు జోసఫ్ (75), రాజు (69) బుధవారం రాత్రి చనిపోగా వృద్ధాశ్రమం వారే రెండు మృతదేహాలను తీసుకువచ్చి పూడ్చిపెట్టారని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
రోడ్డుపైనే శిశువును వదిలేశారు..
* రోడ్డు పక్కన ఎండలో 2 నెలల చిన్నారి * నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన మిర్యాలగూడ టౌన్: ఎర్రగా బొద్దుగా ఉంది.. నుదుట బొట్టు.. బుగ్గపై కాటుక చుక్క.. పక్కన పాల పీక.. చూస్తేనే ఎంత ముద్దొస్తుందో.. ఎర్రటి ఎండలో రోడ్డుపక్కన గుక్కపెట్టి ఏడుస్తోందా పసికందు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రాంనగర్ బంధం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తున్న ఓ ఆటోలో నుంచి మహిళ కిందికి దిగి చిన్నారి నోట్లో పాలపీకను పెట్టి ఖమ్మం రోడ్డులోగల రాంనగర్బంధంసమీపంలో రోడ్డు పక్కన వదిలి వెళ్లింది. నోట్లో నుంచి పాల పీక కిందపడిపోవడంతో ఆ చిన్నారి ఎండలో గుక్కపెట్టి ఏడుస్తోంది. మిర్యాలగూడ నుంచి గరిడేపల్లికి వెళ్తున్న పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షుడు, ఫెయిత్ బంజారా ఆశ్రమ నిర్వాహకుడు డి.హన్యానాయక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ ఘటన స్థలం వద్దకు వెళ్లి ఆ చిన్నారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. సీఐ భిక్షపతి చిన్నారిని సీడీపీవో విశ్వజకి అప్పగించగా నల్లగొండలోని శిశు భవన్‌కు పనికందును తరలించారు. -
తాళం పగులగొట్టి చోరీకి యత్నం
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి క్రాంతినగర్ కాలనీలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. రోడ్డు నంబర్-4లోని తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఇంట్లో ఉండే యువకులు సొంతూళ్లకు వెళ్లారని, నష్టంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అయ్యో.. ఈ పాపం ఎవరిదో?
* పుట్టినకొద్ది గంటల్లోనే రోడ్డు పక్కన * సంచిలో వేసి పడేసిన కర్కశులు వికారాబాద్ రూరల్: ఆడపిల్ల అనుకున్నారో.. మరి ఇంకేదైనా కారణమో.. గుర్తుతెలియని వ్యక్తులు మానవత్వం మరిచిపోయి ఓ పసికందును బ్యాగ్‌లో పెట్టి పడేసి వెళ్లిపోయారు. తల్లిఒడిలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి రోడ్డుపక్కన గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది. పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు చిన్నారిని చేరదీశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం సమీపంలో ఈ ఘటన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు వెలుగుచూసింది. వివరాలు.. ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లోంచి పసికందు ఏడుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూశారు. కొన్ని గంటల క్రితమే పుట్టిన ఆడపిల్ల కనిపించింది. పోలీసులు, చైల్డ్‌లైన్ సిబ్బంది పాపను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పాప ఆరోగ్యంగా ఉండి రెండు కిలోల బరువు ఉంది. దీంతో పాపను చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో తాండూరులోని శిశుగృహకు తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ రవి తెలిపారు. -
రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ
విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందిచ్చి దోపిడీకి పాల్పడ్డారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీబోగీలో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన ఓ తండ్రి, తల్లి, కుమారుడు గురువారం రాత్రి ఏసీ బోగీలో హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి వేళలో వారికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు కలిపిన బాదం మిల్క్ సరఫరా చేసి వారి వద్ద ఉన్న నగలు, నగదుతో పాటు సెల్ఫోన్లను దోచుకున్నారు. గురువారం ఉదయం వారు నాంపల్లి చేరుకున్న తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. తాడే పల్లి - ఏలూరు మధ్యలో మత్తు మందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
కడప పట్టణంలోని పీఎఫ్ ఆఫీసు ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి నుంచి ఓ వ్యక్తి మృతిచెందాడు. సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా కావాలని తోసేశారా అన్నది అనుమానాస్పదంగా ఉంది. మృతుడి వయసు సుమారు 25 ఉంటుందని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్టు కాల్చివేత
ఉత్తర్ ప్రదేశ్ కన్నోజ్ జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండుగులు కాల్చి చంపారు. పోలీసుల కధనం మేరకు సోమవారం సాయంత్రం దీపక్ గుప్తా అనే జర్నలిస్టు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న భార్యను ఇంటికి తీసుకు వచ్చేందుకు బైక్ పై వెళ్లాడు. వీరు ఇంటికి తిరిగి వస్తుండగా.. హసన్ పూర్ వద్ద ద్విచక్ర వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యకులు వీరిని అడ్డగించారు. వెంటనే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకితో దీపక్ గుప్తాపై పాయింట్ బ్యాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపాడు. తొలుత షాక్ గురైన దీపక్ భార్య.. వెంటనే తేరుకు.. సహాయం కోసం కేకలు వేసింది. దీంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దీపక్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే దీపక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దోపిడీ కోసమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి ఎవరైనా శతృవులు ఉన్నారా...? హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. గత ఆరునెలలుగా.. రాష్ట్రంలో జర్నలిస్టులపై వరస దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. -
చేవెళ్లలో మహిళ దారుణ హత్య
- గొంతు కోసి చంపిన దుండగులు - వివరాలు సేకరించిన పోలీసులు చేవెళ్ల రూరల్: చేవెళ్ల మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన నయికుడి రాంచంద్రయ్య, అంజమ్మ దంపతుల కూతురు తులసి(25)ని కొన్నేళ్ల క్రితం యాప్రాల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తను వదిలేసి ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తులసి ఆరు నెలలుగా చేవెళ్ల మండలకేంద్రంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లిదండ్రులు తరచూ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించిన తులసి బుధవారం ఉదయం బయటకు రాలేదు. తలుపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో నల్లానీళ్లు రావడంతో పట్టుకోమని పొరుగువారు కేకలు వేసినా తులసి నుంచి స్పందన లేకుండాపోయింది. స్థానికులు వెళ్లి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తులసి గొంతుపై కోసిన ఆనవాళ్లను గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి వచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
బాంబు కలకలం
వికారాబాద్: గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేస్టేషన్లలో, రైళ్లలో బాంబులు పెట్టామని సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఉదయం 1:30 గంటల నుంచి జాగిలాలతో వికారాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో జాగిలాలు, బాంబ్‌స్క్వాడ్‌తో త నిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని వాడీ, బీదర్ వరకు అన్ని రైల్వేస్టేషన్లలో, ఫ్లాట్‌ఫాంలలో క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు సుమారుగా రెండు గంటల పాటు సాగాయి. పోలీసులు అనుమానిత వస్తువులు, అనుమానితులను తనిఖీ చేశారు. వికారాబాద్ రైల్వే జంక్షన్లో ఆర్పీఎఫ్ సీఐ ర మేష్చందర్రెడ్డి, జీఆర్పీ ఎస్ఐ తిరుపతి, స్థానిక డీఎస్పీ స్వామి, సీఐ రవి,ఎస్ఐలు శేఖర్,నాగరాజు బాంబుస్కాడ్ సిబ్బంది, జాగిలాలతో పరిశీలించారు. ఎట్టకేలకు ఆకతాయి సమాచారం అని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
దయలేని అమ్మలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమ్మా నన్ను అమ్మకే.. ఓ యమ్మా... నాన్నా నీకు దండ మే... నవ మాసాలు నన్ను మోశావమ్మా.. పురిటి నొప్పుల బాధ పడ్డావమ్మా.. పేగు తెంచుక నన్ను గన్నావమ్మా.. పేరు పెట్టకుండ వేరు చేయకమ్మా.. నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓయమ్మా..! నన్ను దూరంజేయబోకమ్మా... అని మెతుకుసీమలో బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతిని.. ఆడపిల్లలను ప్రేమించడమే బతుకమ్మ... పర్యావరణాన్ని రక్షించుకోవడం.. అమ్మను, ఆడబిడ్డను బతికించుకోవడమే ‘బతుకమ్మ’కు అర్థం. పరమార్థం. తెలంగాణ సాకారమై బంగారు బతుకమ్మ నిండు పండగ శోభ సంతరించుకున్న వేళ ఇంకా ముళ్ల పొదల్లో పుత్తడి బొమ్మల మృత్యు కేకలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల పుడితే తప్పు, నట్టిట్లో నడిస్తే ముప్పు.. పెరిగితే అప్పు అనే ధోరణి పల్లెను ఇంకా వదల్లేదు. మెతుకు సీమలో పేదరికం రక్తబంధాన్ని కూడా హేళన చేస్తోంది. అమ్మ వెచ్చని పొత్తిళ్లలో నిద్రపోవాల్సిన పసికందులు ముళ్ల పొదల్లో.. మురికి కాల్వల్లో పడి కన్ను మూస్తున్నారు. జిల్లాలో నెల రోజులుగా వరుసగా ఆడ శిశువును విసిరేసిన సంఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 10 మంది శిశువులను అమ్మలు నిర్దయగా వదిలేసుకున్నారు. గత చేదు సంఘటనలు మరవకముందే బుధవారం గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో మరో సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డులో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించి విషయాన్ని పోలీసులు, శిశు సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఐసీడీఎస్ అధికారి విమల జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో శిశు గృహ అధికారులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. ఇలాంటి సంఘటనే మంగళవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోనూ చోటుచేసుకుంది. వావిలాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బతుకమ్మ తయారు చేసేందుకు తంగేడు పూల కోసం అటవీప్రాంతంలోకి వె ళ్లగా అక్కడ పొదల మధ్య పసికందు కనిపించటంతో మాన్పడిపోయారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నెలరోజుల ఆడ శిశువును పొదలమాటున వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు మహిళలు విషయాన్ని గ్రామపెద్దలకు తెలిపారు. చివరకు శిశు సంక్షేమశాఖ అధికారులు ఆడశిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు. గత నెల 9వ తేదీన మెదక్-చేగుంట రహదారిపై కొర్విపల్లి శివారులో అప్పుడే పుట్టిన మగశిశువును సైతం న్యూస్పేపర్లో చుట్టి మొక్కజొన్న చేనులో వదిలేయగా, స్థానికుల చొరవతో అధికారులు శిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి తరలించారు. ఇక ఐదు నెలల క్రితం వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి పోయారు. ఇలా జిల్లాలో ఆడ శిశువులను అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో, ఆస్పత్రుల్లో వదిలేసి వెళ్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం ఎరుగని, లోకం పోకడ తెలియని పసికందులను వదిలించుకుంటూ మాతృత్వానికి మాయని మచ్చలను మిగులుస్తున్నారు. ఏదిఏమైనా ఆడ శిశువులను వదిలేసి వెళ్లటం సమాజానికి పట్టిన రోగమని సామాజిక కార్యకర్త యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ కూతుళ్లను విక్రయించటం, పొత్తిళ్లలోని ఆడశిశువులను వదిలి వేయటం సమాజంపై దుష్ర్ఫభావం చూపుతుందన్నారు. ఆడ శిశులను వదిలివేసే నీచ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.