సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి క్రాంతినగర్ కాలనీలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు.
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి క్రాంతినగర్ కాలనీలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. రోడ్డు నంబర్-4లోని తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఇంట్లో ఉండే యువకులు సొంతూళ్లకు వెళ్లారని, నష్టంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.