బ్యాంకులో చోరీ యత్నం.. నిందితుడు 7వ తరగతి విద్యార్థి!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో బుధవారం రాత్రి జరిగిన చోరీ యత్నం ఘటనలో ఏడో తరగతి విద్యార్థి సీసీ కెమెరాకు చిక్క డం ఆసక్తిగా మారింది. నిత్యం జనసంచారం.. రహదారికి ప క్కన ఉండే బ్యాంకు ఆవరణలోకి రాత్రి 8.20 గంటలకే బా లుడు రావడం చూస్తుంటే ఎవరైనా డైరెక్షన్ ఇస్తే యాక్షన్‌లోకి దిగాడా లేక స్వతహాగానే వచ్చాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బయ్యారం–పందిపంపుల రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఆవరణలోకి బయ్యారంలో నివాసం ఉంటున్న ఇర్సులాపురానికి చెందిన 13 సంవత్సరాల బాలు డు గడ్డపారతో వెళ్లాడు. వెనుకవైపు గ్రిల్స్‌తో ఉన్న తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించాడు.
బ్యాంకులో పల ఉన్న డెస్‌్కల్లో డబ్బులు, నగలు ఉంటాయేమోనని గంటపా టు వెతికి ఆ తరువాత బయటకు వెళ్లినట్టు సీసీ కెమెరాల ఫు టేజీని బట్టి తెలుస్తోంది. గురువారం ఉదయం బ్యాంకు వద్ద కు స్వీపర్ పద్మ వచ్చింది. తాళం పగులకొట్టిన విషయాన్ని అధికారులకు తెలిపింది. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బాలుడితో సాధ్యమేనా?: కట్టుదిట్టమైన భద్రతమధ్య ఉండే బ్యాంకులోకి 13 సంవత్సరాల బాలుడు ఇతరుల ప్రమేయం లేకుండా చోరీకి యత్నించడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. గడ్డపారతో తాళం పగులకొట్టడం కష్టమని, బాలుడు సునాయాసంగా ఎలాంటి చప్పుడు లేకుండా ఎలా పగులకొట్టాడని, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి చేయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బెదిరింపులతోనే చేశా..: దొంగతనాల్లో అనుభవం ఉన్న ఓ పాత నేరస్తుడు చోరీకి యత్నించిన బాలుడికి ఇటీవల పరిచయం అయినట్టు తెలుస్తుంది. ఆ పరిచయం ఆధారంగా బాలుడిని మచ్చిక చేసుకున్న పాత నేరస్తుడు బ్యాంకు దొంగతనం చేయాలని బెదిరించినట్టు బాలుడు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం.
వెనుక నుంచి బ్యాంకు గోడపైకి ఎక్కించి, తను బయటకు వచ్చే వరకు ఆ పాతనేరస్తుడు అక్కడే ఉన్నాడని, ఆ తరువాత ఇద్దరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లినట్టు బాలుడు చెప్పినట్లు తెలిసింది.
కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న గార్ల–బయ్యారం సీఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి బ్యాంకు పరిసరాలతోపాటు బ్యాంకులో రికార్డయిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. చోరీకి యతి్నంచిన బాలుడి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ఇర్సులాపురంలో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.