అయ్యో.. ఈ పాపం ఎవరిదో? | Birth Within hours a roadside | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఈ పాపం ఎవరిదో?

Published Sat, Apr 9 2016 2:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

అయ్యో.. ఈ పాపం ఎవరిదో? - Sakshi

అయ్యో.. ఈ పాపం ఎవరిదో?

* పుట్టినకొద్ది గంటల్లోనే రోడ్డు పక్కన
* సంచిలో వేసి పడేసిన కర్కశులు

వికారాబాద్ రూరల్: ఆడపిల్ల అనుకున్నారో.. మరి ఇంకేదైనా కారణమో.. గుర్తుతెలియని వ్యక్తులు మానవత్వం మరిచిపోయి ఓ పసికందును బ్యాగ్‌లో పెట్టి పడేసి వెళ్లిపోయారు. తల్లిఒడిలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి రోడ్డుపక్కన గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది. పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు చిన్నారిని చేరదీశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం సమీపంలో ఈ ఘటన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు వెలుగుచూసింది.

వివరాలు.. ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లోంచి పసికందు ఏడుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూశారు. కొన్ని గంటల క్రితమే పుట్టిన ఆడపిల్ల కనిపించింది. పోలీసులు, చైల్డ్‌లైన్ సిబ్బంది పాపను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పాప ఆరోగ్యంగా ఉండి రెండు కిలోల బరువు ఉంది. దీంతో పాపను చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో తాండూరులోని శిశుగృహకు తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement