కడప పట్టణంలోని పీఎఫ్ ఆఫీసు ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి నుంచి ఓ వ్యక్తి మృతిచెందాడు.
కడప పట్టణంలోని పీఎఫ్ ఆఫీసు ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి నుంచి ఓ వ్యక్తి మృతిచెందాడు. సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా కావాలని తోసేశారా అన్నది అనుమానాస్పదంగా ఉంది. మృతుడి వయసు సుమారు 25 ఉంటుందని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.