కడప నగరశివారులోని రాయచోటి రైల్వేగేట్ వద్ద వివాహిత యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
కడప నగరశివారులోని రాయచోటి రైల్వేగేట్ వద్ద వివాహిత యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైఎస్సార్ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన మన్యం శివజ్యోతి(25) ఆదివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శివజ్యోతి భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ నేపధ్యంలో మరో వ్యక్తితో పరిచయం పెంచుకుందని గ్రామస్తులు చెబుతున్నారు. శివజ్యోతి మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.