Sivajyoti
-
కూతురు లేని లోకంలో ఉండలేను!
సాక్షి, కర్నూలు/బనగానపల్లె: ‘నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నాకింత కాలం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. బనగానపల్లెలో నా పెంపుడు కూతురు శివజ్యోతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె లేని లోకంలో నేను ఉండలేనం’టూ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంశెట్టి(49) ఇంట్లో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బనగానపల్లెలోని శాంతివనం వృద్ధాశ్రమం నిర్వహణలో కీలకంగా ఉన్న సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన పెంపుడు కుమార్తె శివజ్యోతి (28) ఒకే రోజు ఆత్మహత్య చేసుకోవడం ఆశ్రమంలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుబ్రహ్మణ్యంశెట్టి స్వగ్రామం కోవెలకుంట్ల. ప్రజాసేవ చేయాలనే తపనతో వివాహం కూడా చేసుకోలేదు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు కొన్నేళ్లుగా బనగానపల్లెలోని యాగంటిపల్లె రోడ్డులో శాంతివనం పేరిట వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శివజ్యోతి పదమూడేళ్ల క్రితం ఆశ్రమానికి చేరి..వృద్ధులకు సేవ చేస్తుండేది. ఆమెను సుబ్రహ్మణ్యం దత్తపుత్రికగా పిలుస్తుండేవారు. డ్యూటీ సమయంలో ఆయన ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వహణ బాధ్యత శివజ్యోతి చూసేది. ఆయనకు రెండు నెలల క్రితం కర్నూలుకు బదిలీ అయ్యింది. దీంతో ఆశ్రమ బాధ్యతలను శివజ్యోతికి అప్పగించి కర్నూలు గాంధీనగర్ పక్కనున్న నంద్యాల గేట్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉంటుండేవాడు. చదవండి: (హైటెక్ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే) ఆయనకు గతంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడి వివాదం తలెత్తడంతో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కాగా.. శివజ్యోతి మంగళవారం ఉదయం సుబ్రహ్మణ్యంశెట్టితో ఫోన్లో మాట్లాడింది. ఆశ్రమ పునర్నిర్మాణ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తర్వాత శివ జ్యోతికి ఫోన్ చేయగా.. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో సుబ్రహ్మణ్యంకు అనుమానం వచ్చింది. అక్కడ పని చేస్తున్న తాపీ మేస్త్రీలకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఆమె తలుపులు తెరవడం లేదని వారు సమాచారమిచ్చారు. తర్వాత సుబ్రహ్మణం సూచన మేరకు తలుపులు పగులగొట్టి చూడగా.. శివజ్యోతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందిన విషయం వెలుగు చూసింది. దీంతో కూతురు లేని లోకంలో తాను ఉండలేనంటూ సుబ్రహ్మణ్యం సూసైడ్ నోట్ రాసి కర్నూలులోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి, శివజ్యోతి మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చదవండి: (అనుమానాగ్నిలో బంధాలు భస్మీపటలం) -
అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బిగ్‌బాస్ తమిళ మూడో సీజన్ మాదిరిగానే.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ను మళ్లీ వైల్డ్కార్డ్ఎంట్రీలో ప్రవేశపెట్టాడు. అక్కడ వనితా విజయ్‌కుమార్‌ను రీఎంట్రీలో తీసుకురాగ.. ఇక్కడ అలీ రెజాను రీఎంట్రీలో తీసుకొచ్చాడు. ఇది బిగ్‌బాస్ షో.. ఇక్కడ ఏమైనా జరుగొచ్చు అనేదానికి నిదర్శనంగానే ఈ రీఎంట్రీని ప్రవేశపెట్టినట్టు అనిపిస్తోంది. ప్రాణ స్నేహితులుగా ఉన్న వరుణ్-రాహుల్ మధ్య గొడవలు జరగడం నిన్నటి ఎపిసోడ్లో అందరం చూశాం. దాని ప్రభావం నేటి ఎపిసోడ్లో పడింది. రాహుల్-పునర్నవి, వరుణ్-వితికాలు మాట్లాడుకోలేదు. వరుణ్ వద్దకు వచ్చి పునర్నవి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హౌస్‌లో అందరూ ఓ వైపు ఉండగా.. రాహుల్-పున్నులు మరోవైపు ఉన్నారు. ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది మగతనం కాదంటూ వరుణ్నుద్దేశించి.. రాహుల్ కాస్త ఘాటుగా మాట్లాడాడు. వర్షంలో డ్యాన్సులు చేసిన జంటలు.. వర్షం పడుతుండటంతో.. పాటలు ప్లే చేయండంటూ హౌస్మేట్స్ బిగ్‌బాస్‌ను కోరగా.. పాటలు ప్లే చేయడంతో డ్యాన్సులు వేస్తు దుమ్ములేపారు. ఎవరి జంటలను వారు పట్టుకుని వర్షంలోఎంజాయ్ చేశారు. ఇక మధ్యలో రాహుల-పునర్నవి వచ్చి జాయిన్ అయ్యారు. మూడు జంటలు కలిసి ఓ వైపు డ్యాన్సులు వేస్తుండగా.. శివజ్యోతి, బాబా, మహేష్ కలిసి మరో వైపు అదరగొట్టారు. రాహుల్-పున్నులకు మహేష్ సలహా.. గొడవ కారణంగా మాట్లాడుకోవడం మానేసిన వరుణ్-రాహుల-పున్ను-వితికాలను మహేష్ ఓ సలహా ఇచ్చాడు. మీరు ఎలాగూ రెండు మూడు రోజుల తరువాత మాట్లాడుకుంటారు. అయితే అంత వరకు మీ మధ్య వచ్చి పుల్లలు పెట్టే వారిని గమనిస్తూ ఉండండి. ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే శ్రీముఖిని పాయింట్ అవుట్చేస్తూనే మహేష్ ఆ ఐడియా ఇచ్చినట్టు కనిపిస్తోంది. గొడవ జరిగింది వరుణ్‌తో కదా.. పునర్నవి తనతో ఎందుకు మాట్లాడటం లేదని వితికా శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అయితే ఈ టాస్క్‌లో రవి-శ్రీముఖిలు గోడను నిర్మించి.. కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు. వీలునామా తన దగ్గరే దాచుకోవడంతో శివజ్యోతిసైతం అర్హత సాధించింది. బెస్ట్ పర్ఫార్మర్గా బాబాను అందరూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి.. కెప్టెన్సీకి అర్హత సాధించేలా చేశారు. దీంతో ఈ వారంలో రవి, శ్రీముఖి, బాబా, శివజ్యోతిలోంచి ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే చాన్స్ ఉంది. అలీ రీఎంట్రీతో శ్రీముఖి ఫుల్ ఖుషీ అయింది. ఇక శివజ్యోతి ఎప్పటిలాగే.. పాతాళగంగలా మారింది. అలీ ఎంట్రీతో శివజ్యోతి, రవి స్ట్రాంగ్ అవుతారు. మరో వైపు శ్రీముఖికి బలం పెరిగినట్టైంది. ఇక వరుణ్-వితికా, పున్ను-రాహుల్ విడిపోవడంతో ఆట మరింత రక్తికట్టనుంది. ఇక ఇంట్లో గ్రూపిజం ఎలా రూపు మారుతుంది? ఎవరెవరు ఒక్కటవుతారు? ఇకపై ఆట ఎలా ఉండబోతుందనన్నది ఆసక్తికరంగా మారింది. -
రైల్వే ట్రాక్‌పై వివాహిత అనుమానాస్పద మృతి
కడప నగరశివారులోని రాయచోటి రైల్వేగేట్ వద్ద వివాహిత యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైఎస్సార్ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన మన్యం శివజ్యోతి(25) ఆదివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివజ్యోతి భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ నేపధ్యంలో మరో వ్యక్తితో పరిచయం పెంచుకుందని గ్రామస్తులు చెబుతున్నారు. శివజ్యోతి మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
యాంకర్ దంపతులపై విదేశీయుడి దాడి
స్నిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చుకదా అంటే దాష్టీకం నిందితుడి రిమాండ్ చిక్కడపల్లి: సిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చు కదా... అన్న పాపానికి టీవీ యాంకర్ ఆమె భర్తపై ఓ విదేశీయుడు దాడి చేశాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎం.సుదర్శన్ కథనం ప్రకారం... ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే మార్గంలోని అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ చానల్లో యాంకర్/న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి తన భర్త ముత్యంతో కలిసి బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి చానల్ ఆఫీసుకు వెళ్తోంది. మార్గం మధ్యలో అశోక్‌నగర్ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకే వాహనంపై వచ్చిన సిరియా దేశస్తుడు సాద్ అబ్దుల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి బైక్‌ను పక్కకు జరపమన్నాడు. రెడ్ సిగ్నల్ ఉంది కదా... కొద్ది సెకన్లు ఆగితే వెళ్లిపోవచ్చు కదా అని అంది. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్ మున్నమ్.. శివజ్యోతి చెంపపై కొట్టాడు. ఎందుకు కొడుతున్నావని ఆమె భర్త ప్రశ్నించగా.. ఆయనపై కూడా చెయ్యి చేసుకొని తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అబ్దుల్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు అబ్దుల్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.