అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి | Bigg Boss 3 Telugu: Ali Reza As Wild Card Entry In Tenth Week | Sakshi
Sakshi News home page

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

Sep 26 2019 10:53 PM | Updated on Sep 27 2019 4:59 AM

Bigg Boss 3 Telugu: Ali Reza As Wild Card Entry In Tenth Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బిగ్‌బాస్‌ తమిళ మూడో సీజన్‌ మాదిరిగానే.. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ను మళ్లీ వైల్డ్‌కార్డ్‌ఎంట్రీలో ప్రవేశపెట్టాడు. అక్కడ వనితా విజయ్‌కుమార్‌ను రీఎంట్రీలో తీసుకురాగ.. ఇక్కడ అలీ రెజాను రీఎంట్రీలో తీసుకొచ్చాడు. ఇది బిగ్‌బాస్‌ షో.. ఇక్కడ ఏమైనా జరుగొచ్చు అనేదానికి నిదర్శనంగానే ఈ రీఎంట్రీని ప్రవేశపెట్టినట్టు అనిపిస్తోంది.

ప్రాణ స్నేహితులుగా ఉన్న వరుణ్‌-రాహుల్‌ మధ్య గొడవలు జరగడం నిన్నటి ఎపిసోడ్‌లో అందరం చూశాం. దాని ప్రభావం నేటి ఎపిసోడ్‌లో పడింది. రాహుల్‌-పునర్నవి, వరుణ్‌-వితికాలు మాట్లాడుకోలేదు. వరుణ్‌ వద్దకు వచ్చి పునర్నవి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇక హౌస్‌లో అందరూ ఓ వైపు ఉండగా.. రాహుల్‌-పున్నులు మరోవైపు ఉన్నారు. ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది మగతనం కాదంటూ వరుణ్‌నుద్దేశించి.. రాహుల్‌ కాస్త ఘాటుగా మాట్లాడాడు. 

వర్షంలో డ్యాన్సులు చేసిన జంటలు..
వర్షం పడుతుండటంతో.. పాటలు ప్లే చేయండంటూ హౌస్‌మేట్స్‌ బిగ్‌బాస్‌ను కోరగా.. పాటలు ప్లే చేయడంతో డ్యాన్సులు వేస్తు దుమ్ములేపారు. ఎవరి జంటలను వారు పట్టుకుని వర్షంలోఎంజాయ్‌ చేశారు. ఇక మధ్యలో రాహుల​-పునర్నవి వచ్చి జాయిన్‌ అయ్యారు. మూడు జంటలు కలిసి ఓ వైపు డ్యాన్సులు వేస్తుండగా.. శివజ్యోతి, బాబా, మహేష్‌ కలిసి మరో వైపు అదరగొట్టారు. 

రాహుల్‌-పున్నులకు మహేష్‌ సలహా..
గొడవ కారణంగా మాట్లాడుకోవడం మానేసిన వరుణ్‌-రాహుల​-పున్ను-వితికాలను మహేష్‌ ఓ సలహా ఇచ్చాడు. మీరు ఎలాగూ రెండు మూడు రోజుల తరువాత మాట్లాడుకుంటారు. అయితే అంత వరకు మీ మధ్య వచ్చి పుల్లలు పెట్టే వారిని గమనిస్తూ ఉండండి. ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే శ్రీముఖిని పాయింట్‌ అవుట్‌చేస్తూనే మహేష్‌ ఆ ఐడియా ఇచ్చినట్టు కనిపిస్తోంది. 

గొడవ జరిగింది వరుణ్‌తో కదా.. పునర్నవి తనతో ఎందుకు మాట్లాడటం లేదని వితికా శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అయితే ఈ టాస్క్‌లో రవి-శ్రీముఖిలు గోడను నిర్మించి.. కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు. వీలునామా తన దగ్గరే దాచుకోవడంతో శివజ్యోతిసైతం అర్హత సాధించింది. బెస్ట్‌ పర్ఫార్మర్‌గా బాబాను అందరూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి.. కెప్టెన్సీకి అర్హత సాధించేలా చేశారు. దీంతో ఈ వారంలో రవి, శ్రీముఖి, బాబా, శివజ్యోతిలోంచి ఎవరో ఒకరు కెప్టెన్‌ అయ్యే చాన్స్‌ ఉంది.

అలీ రీఎంట్రీతో శ్రీముఖి ఫుల్‌ ఖుషీ అయింది. ఇక శివజ్యోతి ఎప్పటిలాగే.. పాతాళగంగలా మారింది. అలీ ఎంట్రీతో శివజ్యోతి, రవి స్ట్రాంగ్‌ అవుతారు. మరో వైపు శ్రీముఖికి బలం పెరిగినట్టైంది. ఇక వరుణ్‌-వితికా, పున్ను-రాహుల్‌ విడిపోవడంతో ఆట మరింత రక్తికట్టనుంది. ఇక ఇంట్లో గ్రూపిజం ఎలా రూపు మారుతుంది? ఎవరెవరు ఒక్కటవుతారు? ఇకపై ఆట ఎలా ఉండబోతుందనన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement