
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో మరోసారి కలకలం రేగింది. మావోయిస్టులు తలపెట్టిన ముప్పును పోలీసు బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేశాయి. రిమోట్ ల్యాండ్‌మైన్లను గుర్తించడంతో ఆదివాసీలతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పోలీసులు జి.మాడుగుల మండలం మారుమూల నుర్మతి అవుట్‌పోస్టు సమీపంలో నాలుగు అత్యంత శక్తిమంతమైన మందుపాతరలను (ల్యాండ్‌మైన్లు) గురువారం పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పర్యవేక్షణలో వాటిని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. అవుట్‌పోస్టు పరిసరాల్లో సుమారు రూ.50కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరో వైపు సివిక్ యాక్షన్‌లో భగంగా గ్రామదర్శిని పేరిట చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవుట్‌పోస్టు సమీపంలో సుమారు 300 మంది ఉంటున్న గిరిజన ఆశ్రమ
Comments
Please login to add a commentAdd a comment