శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీని అమర్చిన ఉగ్రవాదులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం నిముషాల వ్యవధిలో దాన్ని నిర్వీర్యం చేశారు.
పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు అప్పుడే భారత దేశంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశాయి ఉగ్రమూకలు. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఐఈడీ ని అమర్చారు ఉగ్రవాదులు. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ కు సమాచారమందించారు.
వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐఈడీని నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ ఈ పేలుడు గనుక యధాతధంగా జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లేది.
ఇది కూడా చదవండి: ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment