
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం చెలరేగింది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ వ్యాఖ్యలు చేశారు.
బాంబు ఫోన్ కాల్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో చార్మినార్ వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బాంబు ఫోన్ కాల్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, నిజంగానే బాంబు అమర్చారా? లేక ఎవరైనా పోకిరీ ఇలా ఫోన్ చేశాడా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment