హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు | bomb threat to hero ajith house in chennai | Sakshi
Sakshi News home page

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

Published Sat, Aug 30 2014 12:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

ఆట ఆరంభం సినిమాలో హీరో అజిత్ బాంబు నిర్వీర్య దళం నిపుణుడు. అలాంటి అజిత్ ఇంటికే శనివారం నాడు ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 'తాళ 55' షూటింగులో అజిత్ బిజీగా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి, ఆ ఇంట్లో బాంబు ఉందని బెదిరించాడు. దాంతో బాంబుస్క్వాడ్ ఆయన ఇంటికి హుటాహుటిన చేరుకుని వెంటనే అక్కడ అణువణువూ గాలించింది. అయితే, ఎలాంటి బాంబు లేకపోవడంతో అది ఉత్తుత్త కాల్ మాత్రమేనని తేలింది.

అయితే, ఈ బెదిరింపు రావడానికి కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. పోలీసులు ఆ ఫోన్ చేసిందెవరో తేల్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని భరత్ అనే పాత్రికేయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''ఈసీఆర్లోని అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు బాంబుస్క్వాడ్ మొత్తం పరిసరాలను గాలించింది. అది ఉత్తుత్త కాల్ అని తేలింది'' అని భరత్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement