
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద బ్యాగుల కలకలం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం అనుమానాస్పద బ్యాగులు కలకలం రేపాయి. కార్యాలయం గేట్ వద్ద మూడు బ్యాగ్లను సెక్యూరిటీ సిబ్బంది కనుగొన్నారు. దాంతో అప్రమత్తమైన వారు బాంబ్, డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు చేపట్టారు. కాగా ఆ బ్యాగ్లు తామవేనంటూ ఓ యువతి అక్కడకు రావటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము నరేంద్ర మోడీని చూసేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయంకు వచ్చినట్లు ఆమె తెలిపింది.
అయితే బ్యాగ్లు అక్కడ వదిలి ఎక్కడకు వెళ్లారనే దానిపై సమాచారం లేదు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా బ్యాగులు తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేనట్లు సమాచారం. మరోవైపు నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన కాసేపు భద్రతా అధికారులను ఉరుకులు పరుగులు తీయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.