సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడిలో తెదేపా అధినేత చంద్రబాబు హాజరుకానున్న ‘రా.. కదలిరా’ సభాస్థలి వద్ద ఇవాళ జరిగిన పరిణామాలను నాటకీయంగా మలుచుకునేందుకు యత్నించి యెల్లో మీడియా భంగపడింది. ఆయన హెలికాఫ్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ వద్ద సిగ్నల్ బజర్ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అతలాకుతలం అయ్యారు. ఈ క్రమంలో.. బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. తీరా చూస్తే అది ఇనుప ముక్క!.
చింతలపూడిలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నిర్మాణం వద్ద సిగ్నల్ బజర్ మోగిందట. దీంతో.. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే అక్కడ ఇనుప ముక్క ఉండడం వలన బజర్ మోగినట్లు పోలీసు అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇనుప ముక్క బయటకు వచ్చింది తప్ప మరి ఇతర వస్తువులు లేవని బాంబ్స్ స్క్వాడ్ నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు పోటీ స్థానం ఫిక్స్?
అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్న టైంలో.. యెల్లో మీడియా మామూలుగా హడావిడి చేయలేదు. చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బా*బు బజర్ అంటూ ఓ ఛానెల్.. చంద్రబాబు రా కదలిరా సభ హెలిపాడ్ వద్ద కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అంటూ మరో వెబ్‌సైట్.. ఇక చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద బాంబు నేరుగా నిర్ధారించుకుని ఓ కథనం అల్లేసింది టీడీపీ అనుకూల వెబ్‌సైట్. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా పేజీలు సైతం ఆ తనిఖీలను మరోరకంగా ప్రచారానికి వాడుకున్నాయి. అయ్యయో.. బాబుగారికి ఏదో జరిగిపోతోందే అనే రేంజ్‌లో హడావిడి చేసేశాయి.. అయితే.. సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారాలను చూసి ఎవ్వరూ నమ్మ వద్దని చింతలపూడి పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment