ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పలుచోట్ల బాంబులు పెట్టామని ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ముంబైలోని ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సప్ నంబరుకు ఈ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, అంతకుముందు కూడా ముంబైకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనంతరం, పోలీసుల దర్యాప్తులో భాగంగా అవన్నీ నకిలీవేనని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment