
(ఫైల్ ఫొటో)
ముంబై ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ బాంబు పేలుళ్లకు సంబంధించిన బెదిరింపులతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడుతామంటూ శనివారం సాయత్రం 6 గంటలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘ముంబైలో బాంబు పేలుళ్లు ఉంటాయి’ అని గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే వెంటనే స్పందిన పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా.. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు తమ దృష్టికి రాలేదన్నారు. అయితే ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ కాల్‌ను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు అప్రమత్తమై నగరం మొత్తం హైఅలర్ట్ ప్రకటించి సెక్యూరిటీ పెంచారు.
చదవండి: బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ!