పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్‌మైన్ | Land Mine near palem Project | Sakshi
Sakshi News home page

పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్‌మైన్

Published Sun, Mar 5 2017 4:15 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్‌మైన్ - Sakshi

పాలెం ప్రాజెక్టు సమీపంలో ల్యాండ్‌మైన్

► గుర్తించిన ‘ఉపాధి’ కూలీలు
► పోలీసులకు సమాచారం

వెంకటాపురం (భద్రాచలం): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల పరిధి మల్లాపురం సమీప పాలెం ప్రాజెక్టు వద్ద శనివారం ల్యాండ్‌మైన్  బయటపడింది. అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వేందుకు ఉపాధి హామీ కూలీలు ఉదయం పనులు చేపట్టారు.

కొందరు కూలీలు కొప్పుగుట్ట సమీప అటవీప్రాంతంలో మూత్రవిసర్జనకు వెళ్లగా... కాళ్లకు కరెంట్‌ వైర్లు తగలడంతో వాటిని పరిశీలించారు. వైర్లు రోడ్డు మీద తవ్విన గుంత వరకు ఉండడాన్ని గమనించి భయంతో అదే ప్రాంతంలో పనిచేస్తున్న మిగతా కూలీలకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ల్యాండ్‌మైన్ గా గుర్తించారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement