
తిరుమలలో బాంబుల కలకలం
తిరుమల, తిరుపతిలలో బాంబుల కలకలం చెలరేగింది. దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలలో పలుచోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేశారు.
దాంతో తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, యాత్రికుల సముదాయాల్లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు. అలిపిరి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో బాంబు స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేశారు. నాలుగు బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేస్తున్నట్లు అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ కర్ణాటక నుంచి వచ్చిందని, ఆ ఫోన్ కాల్ ఆధారంగా తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు.