
వేమూరి ఆనంద్ సూర్య
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చెవాకులు పేలితే మర్యాద దక్కదని ఐవైఆర్ కృష్ణారావును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎస్ ఐవైఆర్ తీరు గర్హనీయమైందనీ, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఐవైఆర్ సొంత అజెండాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని, రాజధాని నిర్మాణం, హోదా గురించి మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ లాంటి కుహానా వ్యక్తులు ఏ వేదికల్లో ఉంటే ఆ వేదికలు అధోగతి పాలవుతాయని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment