ట్యాపింగ్‌పై కేంద్రానికి ఏపీ ఫిర్యాదు?
హోం శాఖ కార్యదర్శితో సీఎస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో భేటీ అయ్యారు. టీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సెక్షన్ -8 ను అమలు చేయాలని, గవర్నర్‌కు అధికారాలివ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజాప్రతినిధుల స్వేచ్ఛకు భంగం కలిగేలా టీ సర్కా ర్ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
దీనికి గోయల్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య ఉన్నట్టు ఫిర్యాదులు, నివేదికలేవీ? సెక్షన్-8ను ఎందుకు అమలు చేయాలి? అని ప్రశ్నించినట్టు సమాచారం. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలపైనా సీఎస్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు టెలికం కమిషన్ చైర్మన్, కార్యదర్శి రాకేష్ గర్గ్‌లతో భేటీ అయిన సీఎస్.. ట్యాపింగ్‌పై ఆధారాల్ని అందజేసినట్టు సమాచారం.
విలేకరులపై సుజనా అసహనం
‘వాట్ ఏసీబీ..? తెలంగాణ, ఆంధ్రాలో ఏం సమస్య ఉంది? నాకు తెలియదు’ అంటూ కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో గురువారం ఉదయం ‘వాతావరణ మార్పు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు సందర్భంగా ఓటుకు కోట్లు కేసు, ఏసీబీ దర్యాప్తుకు సంబంధించి సుజనా చౌదరిపై విలేకరులు ప్రశ్నించగా జవాబు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశారు.