
ఐవైఆర్ కృష్ణారావు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాలనపై అసంతృప్తిగా ఉన్న వారి ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా తమకు ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. అసంతృప్తిగా ఉన్నామని చెపితే ఓటర్ జాబితా నుంచి వారి పేరును తీసివేసే అవకాశం ఉందన్నారు. ఎందుకైనా మంచిది.. కొన్ని రోజుల తరువాత ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒక సారి చూసుకోవడం ఉత్తమం అని ఆయన సూచించారు. ఆదివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనపై రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. చాలా మంది ప్రజలు ఆయన పాలనపై అసంతృప్తిగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment