సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతాధికారిగా (సీఎస్‌ఓ) పి.పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఆర్.ఎం.కిషోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పి.పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడిషనల్ ఎస్పీగా (అడ్మినిస్ట్రేషన్) పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సీఎస్‌వోగా నియమించారు.
డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్ ర్యాంకు
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment