ప్రేమించాలని వేధిస్తున్నందుకు... | Case filed on man to harrassing lover | Sakshi
Sakshi News home page

ప్రేమించాలని వేధిస్తున్నందుకు...

Published Sat, Aug 8 2015 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

ప్రేమించాలని వేధిస్తున్నందుకు...

ప్రేమించాలని వేధిస్తున్నందుకు...

నాగోలు: పెళ్లి చేసుకోమని ఓ యువతి వెంటపడి వేధిస్తున్న యువకునిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బండ్లగూడ ప్రాంతానికి చెందిన యువతి (24) కళాశాలకు వెళ్లే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మల్లేశ్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు.

ఈ క్రమంలో ఆరు నెలల క్రితం నాగోలు చౌరస్తాలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల ఆ యువతికి వివాహం నిశ్చయం అయింది. సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి పెళ్లి కొడుకుకు మల్లేశ్ పంపాడు. ఇది తెలుసుకున్న బాధితురాలు శనివారం ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement