
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఘటన
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు..
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్‌కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు.
కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.
Video Credit To Polimer News
Comments
Please login to add a commentAdd a comment