బాలికను బలిగొన్న చెరువు | child fall in pond and died | Sakshi
Sakshi News home page

బాలికను బలిగొన్న చెరువు

Published Fri, Jun 26 2015 1:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

బాలికను బలిగొన్న చెరువు - Sakshi

బాలికను బలిగొన్న చెరువు

బండ్లగూడ చెరువు వద్ద ఘటన
నాగోలు:
ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యార్థిని మృతి చెందింది.  ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్, సైదా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి నాగోలు సాయినగర్‌లోని గుడిసెల్లో ఉంటున్నారు.  జహంగీర్ పెయింటర్ పని చేస్తుండగా.., సైదా ఇళ్లల్లో పని చేస్తోంది. వీరి చిన్న కూతురు సనా(10) స్థానిక  ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది.

గురువారం ఉదయం తన స్నేహితురాలు హస్రత్‌ఫాతిమా(9)తో కలిసి చెత్త వేసేందుకు బండ్లగూడ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సనా చెరువులో పడిపోయింది.  స్నేహితురాలు హస్రత్ కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. సనా నీటిలో మునిగిపోవడంతో వెంటనే హస్రత్ ఫాతిమా ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకొని గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లను రప్పించి వెతికించారు. ఉదయం నుంచీ గాలించగా మధ్యాహ్నానానికి మృతదేహం లభించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement