చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల గల్లంతు
Published Sat, Oct 1 2016 9:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
మద్నూర్: నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం చిన్నషక్కర్‌గాం చెరువులో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు శుక్రవారం సాయంత్రం చెరువులో ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి కోసం కుటుంబసభ్యులు వెతకగా చెరువు గట్టుపై వారి దుస్తులు, చెప్పులు కనిపించటంతో లోపలికి దిగి ఈత కొట్టే క్రమంలో మునిగి ఉంటారని భావిస్తున్నారు. అయితే, రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో శనివారం ఉదయం వారి కోసం గాలింపు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement