
బెంగళూరునూ బెంబేలెతిస్తున్నారు...
బెంగళూరు: భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులోనూ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గురువారం ఒక్కరోజే ఆరు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఉదయం 6 గంటల ప్రాంతంలో జరగడం గమనార్హం. వరుస చైన్ స్నాచింగ్ లతో
బయటకు రావడానికి మహిళలు భయపడుతున్నారు.
బుధవారం 8 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్ లకు తెగబడ్డారు. జేపీ నగర, జయనగర, బీజీఎం లేఅవుట్, యలహంక మారుతీనగర, బీహెచ్ఇఎల్ లేఅవుట్, పీణ్యా సిద్దార్ధ లేఅవుట్, అమృతహళ్లి ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితులు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.