కరీంనగర్: ఆటోలో వెళ్తున్న మహిళ పుస్తెలతాడును ఆగంతకులు తెంపుకుని పోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిపేట చెందిన సులోచన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళుతోంది.
గ్రామం సమీపంలోకి ఆటో రాగానే... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు సులోచన మెడలోని మూడున్నర తులాల పుస్తెల తాడును తెంపుకుని పోయారు. సదరు వ్యక్తులను ఆటోలో వెంబడించిన వారు అప్పటికే పరారైయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.