Yella reddy peta
-
కరీంనగర్లో చైన్‌స్నాచింగ్
కరీంనగర్: ఆటోలో వెళ్తున్న మహిళ పుస్తెలతాడును ఆగంతకులు తెంపుకుని పోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిపేట చెందిన సులోచన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళుతోంది. గ్రామం సమీపంలోకి ఆటో రాగానే... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు సులోచన మెడలోని మూడున్నర తులాల పుస్తెల తాడును తెంపుకుని పోయారు. సదరు వ్యక్తులను ఆటోలో వెంబడించిన వారు అప్పటికే పరారైయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
వేలంపాటపై డీఎస్పీ విచారణ
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: దుమాలలో ఎంపీటీసీ సభ్యుడి ఏకగ్రీవం కోసం జరిగిన వేలంపాటపై సోమవారం పోలీసులు విచారణ జరిపారు. సర్పంచ్‌తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సరిగ్గా నామినేషన్ల తొలిరోజే పోలీసులు పార్టీల నాయకులకు గట్టి షాక్ ఇచ్చారు. దుమాలతో పాటు సిరిసిల్ల పట్టణంలో పుస్తెమెట్టెలు పంపిణీ చేసిన సంఘటనపై మరో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ దామెర నర్సయ్య తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం సొంత డబ్బుతో రోడ్డు వేయిస్తామని ఉల్లి కిష్టయ్య, ఉల్లి బాలయ్య ముందుకు రాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆదివారం రాత్రి, సోమవారం గ్రామంలో రెండు దఫాలుగా బహిరంగ విచారణ జరిపారు. డీఎస్పీ స్వయంగా వెళ్లి వేలం ఘటనపై ఆరా తీశారు. ఓటర్లు మనోభావాలను వ్యక్తం చేయకుండా అడ్డుకోవ డంలో భాగంగానే సమావేశం ఏర్పాటుచే సి ఏకగ్రీవ ప్రయత్నాలు చేశారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి తహశీల్దార్ అమర్నాథ్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ నర్సింహరెడ్డితో పాటు ఉల్లికిష్టయ్య, ఉల్లి బాలయ్యపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం మాడల్టీంను ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ పరిధిలో డబ్బులు, మద్యం, సామగ్రి సరఫరా జరుగకుండా ఆరు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రంగయ్యగౌడ్ , ఎస్సై రమేశ్‌కుమార్, ఏఎస్సైలు మురళీధర్ రావు, రవీందర్ ఉన్నారు. -
నేత కార్మికుడి కుటుంబానికి బాసట
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : నేతకార్మికుడి ఆకలిచావుపై కలెక్టర్ వీరబ్రహ్మయ్య చలించిపోయారు. బాధిత కుటుం బానికి ఆపన్నహస్తం అందించారు. నేతన్న కుటుంబానికి గూడు కల్పించాలని, చితికిపోయిన వారికి అండగా నిలవాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన నేత కార్మికుడు దొంత రాజమల్లు(60) మంగళవారం రాత్రి ఆకలిచావుకు గురయ్యాడు. ‘ఆకలిచావు’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్ వీరబ్రహ్మయ్య స్పందించారు. ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ సుమతో మాట్లాడి నేతన్న కుటుంబం వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తహశీల్దార్ రాజమల్లు కుటుంబం స్థితిని ఫొటోలు తీసి కలెక్టర్‌కు పంపించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో తలదాచుకుంటున్న వైనాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. మృతుడి భార్య ఎల్లవ్వ, జాడతెలియకుండా పోయిన పెద్దకుమారుడు మహేందర్, చిన్న కుమారుడు సాగర్ వివరాలను అందజేశారు. సాగర్ మెకానిక్ షెడ్డులో వాహనాలను శుభ్రం చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్న విషయాన్ని వివరించారు. బాధిత కుటుంబానికి నేతన్న కుటుంబాల ప్యాకేజీ కింద రూ.1.50 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రూ.10 వేల నగదు, కార్మిక కుటుంబానికి పింఛన్ అందజేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తహశీల్దార్ తెలిపారు. మృతుడి చిన్నకుమారుడు సాగర్‌కు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.