ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : నేతకార్మికుడి ఆకలిచావుపై కలెక్టర్ వీరబ్రహ్మయ్య చలించిపోయారు. బాధిత కుటుం బానికి ఆపన్నహస్తం అందించారు. నేతన్న కుటుంబానికి గూడు కల్పించాలని, చితికిపోయిన వారికి అండగా నిలవాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన నేత కార్మికుడు దొంత రాజమల్లు(60) మంగళవారం రాత్రి ఆకలిచావుకు గురయ్యాడు. ‘ఆకలిచావు’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్ వీరబ్రహ్మయ్య స్పందించారు. ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ సుమతో మాట్లాడి నేతన్న కుటుంబం వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తహశీల్దార్ రాజమల్లు కుటుంబం స్థితిని ఫొటోలు తీసి కలెక్టర్‌కు పంపించారు.
ఆరోగ్య ఉపకేంద్రంలో తలదాచుకుంటున్న వైనాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. మృతుడి భార్య ఎల్లవ్వ, జాడతెలియకుండా పోయిన పెద్దకుమారుడు మహేందర్, చిన్న కుమారుడు సాగర్ వివరాలను అందజేశారు. సాగర్ మెకానిక్ షెడ్డులో వాహనాలను శుభ్రం చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్న విషయాన్ని వివరించారు. బాధిత కుటుంబానికి నేతన్న కుటుంబాల ప్యాకేజీ కింద రూ.1.50 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రూ.10 వేల నగదు, కార్మిక కుటుంబానికి పింఛన్ అందజేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తహశీల్దార్ తెలిపారు. మృతుడి చిన్నకుమారుడు సాగర్‌కు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
నేత కార్మికుడి కుటుంబానికి బాసట
Published Fri, Jan 31 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement