ఎమ్మెల్యేలు ఎస్సంటేనే.. | Constituencies represented by the ruling party MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు ఎస్సంటేనే..

Published Wed, Jun 18 2014 2:50 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

ఎమ్మెల్యేలు  ఎస్సంటేనే.. - Sakshi

ఎమ్మెల్యేలు ఎస్సంటేనే..

మెట్‌పల్లి రూరల్ : జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారు ఔనంటేనే తహసీల్దార్లను, ఎంపీడీవోలను బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సమయంలో నియమావళి మేరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల తహసీల్దార్లను, ఎంపీడీవోలను వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు బదిలీ చేశారు.

వారందరిని తిరిగి పాత స్థానాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమకు అనుకూలమైన, గతంలో పనిచేసిన మండలాల్లో తిరిగి పోస్టింగ్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో తమ ఎమ్మెల్యేలకు సహకరించే వారిని మాత్రమే తిరిగి బదిలీ చేయాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీడీవోలు, తహసీల్దార్ల బదిలీలకు అనుకూలంగా కాన్సెంట్ లెటర్లు కలెక్టర్‌కు అందిస్తేనే బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నట్లు వినికిడి. దీంతో తమకు అనుకూలమైన స్థానాల కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement