
16 మందిపై దూసుకెళ్లిన పెళ్లి కారు
ప్రైవేట్ వాహనాల్లో ఆçస్పత్రులకు తరలింపు
కరీంనగర్: పెళ్లి బరాత్లో విషాదం చోటు చేసుకుంది. పెండ్లి కొడుకు, కూతురు కూర్చున్న కారు బరాత్‌లో డ్యాన్స్ చేసేవారిపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో గురువారం రాత్రి పెళ్లి బరాత్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉదయం మెట్‌పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభాకర్ కూతురు వివాహం జరిగింది. రాత్రి అప్పగింతలు పూర్తయ్యాక గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుంది. నూతన వధువు, వరుడు కారులో కూర్చోగా బంధువులు సుమార్ 30 మంది వరకు బరాత్‌లో పాల్గొన్నారు.
పెళ్లి కుమారుడు, కూతురు ఉన్న కారు డ్రైవర్ ఎక్సలేటర్ తొక్కడంతో బరాత్‌లో కారు ముందు ఉన్న వారిపైనుంచి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకు గురైన డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిని ప్రైవేట్ వాహనాల్లో హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment