wedding party
-
అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లి పార్టీలో.. నాగ చైతన్య,శోభిత (ఫొటోలు)
-
ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పే ముందు.. బోరిస్ భారీ ప్లాన్.. చెకర్స్‌లో..
లండన్: ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని గురువారం అధికారికంగా ప్రకటించారు బోరిస్ జాన్సన్. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే తాను ప్రధాని హోదాలో ఉండగానే చివరగా గ్రాండ్ పార్టీకి ఆయన్ ప్లాన్ చేసినట్లు బోరిస్ సన్నిహిత వర్గాలు చెప్పాయని బ్రిటన్ మీడియా తెలిపింది. చాలాకాలంగా సహజీవనం చేస్తున్న కేరీని గతేడాది పెళ్లి చేసుకున్నారు ఆయన. అయితే కరోనా కారణాల వల్ల ఈ వేడుక అతికొద్ది మంది సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే ఇప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలని బోరిస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అధికారిక నివాసం 'చెకర్స్'లో ఈ పార్టీ ఉండనుంది. బ్రిటన్ ప్రధాని కార్యాలయం 10 డౌన్ స్ట్రీట్‌లో ఉంటుంది. చెకర్స్ ప్రధాని అధికారిక నివాసం. 600 హెక్టార్ల విస్తీర్ణంతో ఎంతో విశాలంగా ఉండే ఈ భవన సముదాయంలో ప్రపంచనేతలతో సమావేశాలు, విందు కార్యక్రమాలు, పార్టీలకు బ్రిటన్ ప్రధానులు ఉపయోగిస్తుంటారు. 1920 నుంచి ఇది వాడుకలో ఉంది. చెకర్స్‌లో జులై 30న బోరిస్ పార్టీ ఇవ్వనున్నట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఇది ఎంతో గ్రాండ్‌గా, గ్లామరస్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపింది. బోరిస్ స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇప్పటికే ఆహ్వానం అందిందని మీడియా వెల్లడించింది. -
అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా 9 మంది మృతి
-
విషాదం: పెళ్లి విందులో భోజనం తిని..
సాక్షి, శివమొగ్గ: పెళ్ళి విందులో భోజనం ఆరగించి పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ప్రాణాలు కోల్పోయారు. మృతుడు శివమొగ్గ తాలూకాలోని ఆరికెరె గ్రామా పంచాయతీకి చెందిన పిడిఓ దినేష్‌సింగ్ (42). ఈ నెల 17న అరదోట్లు గ్రామంలో ఒక పెళ్లిలో ఆయన భోజనం తిన్నారు. వెంటనే వాంతులు, విరేచనాలతో పాటు చలి జ్వరం వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విందులో ఆహారం తిన్న అనేకమందికి కూడ వాంతులు, విరేచనాలు అయ్యాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం) చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
విషాదం: పెళ్లి బృందంపై పిడుగు.. 16 మంది మృతి
ఢాకా: నవవధువు, వరుడిని ఆశీర్వదించాలని వెళ్లిన అతిథులను మృత్యువు పిడుగు రూపంలో వెంటాడింది. సంతోషంతో సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో క్షతగాత్రులను కాపోడుకోవడానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ విషాదం ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. చపైనవాబ్‌గంజ్ జిల్లాలో ఓ వివాహానికి వచ్చిన బృందం పడవ దిగి నదీ సమీపంలోని షిబ్‌గంజ్ నగరంలో తమ విడిది ప్రాంతానికి వెళ్తున్నారు. అంతలో హఠాత్తుగా రుతుపవనాల కారణంగా భారీ వర్షంతో పాటు పిడుగులు పడటం మొదలైంది. దీంతో పడవలో నుంచి ఒక్కొక్కరు దిగివస్తుండగా ఆ పెళ్లి బృందంపై సెకన్ల వ్యవధిలోనే పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సభ్యులు మృతి చెందగా, పలువరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వరుడికి తీవ్రగాయాలు కాగా వధువు ప్రమాద జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో లేకపోవడంతో క్షేమంగా బయటపడింది. అందులో గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య జిల్లా కాక్స్ బజార్లో ఆరుగురు రోహింగ్యా శరణార్థులతో సహా 20 మంది మృతి చెందారు. -
వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ : భార్యను కడతేర్చిన భర్త
పట్నా : వివాహ వేడుకలో అతిధులతో కలిసి డ్యాన్స్ చేయడమే భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. బిహార్‌లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖోరంగ్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లితండ్రుల వద్దకు పదిరోజుల కిందట పిల్లలతో కలిసి వచ్చారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త కూడా మూడు రోజుల కిందట అత్తగారింటికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భర్త, పిల్లలతో కలిసి మునియా కూడా పాల్గొన్నారు. ఇక డీజేకు అనుగుణంగా వెడ్డింగ్ పార్టీలో అతిధులతో కలిసి మునియా డ్యాన్స్ వేయడం భర్త రంజిత్ మాంఝీకి ఆగ్రహం కలిగించింది. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరిఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్ధలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు. -
స్నేహితుడి పెళ్లిలో కోహ్లీ కిరాక్ డాన్స్
-
పెళ్లిలో కోహ్లీ కిరాక్ డాన్స్.. వైరల్ వీడియో
సాక్షి, స్పోర్ట్స్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సంచలనం, వైరల్‌గా మారుతుంది. సెంచరీ చేసినా, డాన్స్ చేసినా వైరల్ అవుతుంది. తాజాగా ఇటీవల సన్నిహితుల పెళ్లికి హాజరైన కోహ్లీ మరోసారి తన దైన శైలిలో వార్తల్లో నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ విజయవంతమైన తర్వాత విరాట్ కోహ్లీ కొంత విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో విరాట్ సరదాగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల పంజాబీ పెళ్లికి హాజరైన విరాట్ తనలో ఉన్న డాన్స్ టాలెంట్‌ను మరోసారి బయటపెట్టాడు. గ్రౌండ్‌లోనే కాదు ఎక్కడైనా చెలరేగిపోగలడని నిరూపించుకున్నాడు. పెళ్లిలో భాంగ్రా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. పంజాబీ పాటకు స్నేహితుడితో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఈ వీడియోలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఎక్కడా కనిపించలేదు. కోహ్లీతో పాటు శిఖర్‌ధావన్, కేఎల్ రాహుల్‌లు కూడా డాన్స్ చేయడం ఇందులో చూడొచ్చు. -
పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ కు సమీపంలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. దెహస్లా గ్రామంలోని పెళ్లి విందులో చెలరేగిన చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది. తీవ్ర ఆగ్రవేశాలతో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో 21 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పిల్లలు, వృధ్దులు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బంధువుల రోదనలతో ఆ ఇంట విషాదం నెలకొంది. సుదీర్ఘ కాలంగా వైరం కొనసాగుతున్న రెండు గ్రూపుల మధ్య రగిలిన వివాదం కాల్పులు దారి తీసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసు అధికారి గులిస్తాన్ ఖాన్ తెలిపారు. -
పెళ్లి బృందం లారీ బోల్తా : ఆరుగురు మృతి
ఒంగోలు: పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ నల్లమల్ల అటవీ ప్రాంతంలో బోల్తా పడి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గిద్దలూరులోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పెళ్లి బృందంలోని సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి బృందం గిద్దలూరు నుంచి మహానంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సానూభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం - కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని మహానంది మండలం చింతమాని మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. -
గ్రేనేడ్‌తో వివాహ వేడుకపై దాడి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ బాల్క్ ప్రావెన్స్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. చమ్మథాల్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ వేడుకపైకి ఆగంతకుడు గ్రేనేడ్ విసిరాడు. ఆ గ్రేనెడ్ పేలుడులో నలుగురు మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆ దాడికి తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పోలీసులు వెల్లడించారు. -
బోల్తా పడిన బస్సు: 14 మంది మృతి
జార్ఘండ్: ఓ పెళ్లి వేడుకల కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో బస్సు బోల్తాపడి 14 మంది మృతి చెందిన ఘటన గొడ్డా జిల్లాలోని భాతొండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుకులకు హాజరైన కోసం 31 మందితో కూడిన బస్సు.. తిరిగి వస్తుండగా భాతొండా సమీపంలోని పోరియాహత్ బ్లాక్ వద్ద అకస్మికంగా బోల్తాకొట్టింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నట్లు ఎస్పీ అజయ్ లిండా తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.