
ప్రతీకాత్మక చిత్రం
పట్నా : వివాహ వేడుకలో అతిధులతో కలిసి డ్యాన్స్ చేయడమే భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. బిహార్‌లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖోరంగ్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లితండ్రుల వద్దకు పదిరోజుల కిందట పిల్లలతో కలిసి వచ్చారు.
ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త కూడా మూడు రోజుల కిందట అత్తగారింటికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భర్త, పిల్లలతో కలిసి మునియా కూడా పాల్గొన్నారు. ఇక డీజేకు అనుగుణంగా వెడ్డింగ్ పార్టీలో అతిధులతో కలిసి మునియా డ్యాన్స్ వేయడం భర్త రంజిత్ మాంఝీకి ఆగ్రహం కలిగించింది. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరిఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్ధలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment