విషాదం: పెళ్లి విందులో భోజనం తిని.. | PDO Lost His Life After Eating Meal At Wedding Party Shivamogga | Sakshi
Sakshi News home page

విషాదం: పెళ్లి విందులో భోజనం తిని..

Published Tue, Nov 23 2021 7:01 AM | Last Updated on Tue, Nov 23 2021 12:56 PM

PDO Lost His Life After Eating Meal At Wedding Party Shivamogga - Sakshi

సాక్షి, శివమొగ్గ: పెళ్ళి విందులో భోజనం ఆరగించి పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) ప్రాణాలు కోల్పోయారు. మృతుడు శివమొగ్గ తాలూకాలోని ఆరికెరె గ్రామా పంచాయతీకి చెందిన పిడిఓ దినేష్‌సింగ్‌ (42). ఈ నెల 17న అరదోట్లు గ్రామంలో ఒక పెళ్లిలో ఆయన భోజనం తిన్నారు. వెంటనే వాంతులు, విరేచనాలతో పాటు చలి జ్వరం వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విందులో ఆహారం తిన్న అనేకమందికి కూడ వాంతులు, విరేచనాలు అయ్యాయి. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో: సీఎం) 

చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్‌ఐని చంపేశాం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement