
సాక్షి, స్పోర్ట్స్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సంచలనం, వైరల్‌గా మారుతుంది. సెంచరీ చేసినా, డాన్స్ చేసినా వైరల్ అవుతుంది. తాజాగా ఇటీవల సన్నిహితుల పెళ్లికి హాజరైన కోహ్లీ మరోసారి తన దైన శైలిలో వార్తల్లో నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ విజయవంతమైన తర్వాత విరాట్ కోహ్లీ కొంత విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో విరాట్ సరదాగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇటీవల పంజాబీ పెళ్లికి హాజరైన విరాట్ తనలో ఉన్న డాన్స్ టాలెంట్‌ను మరోసారి బయటపెట్టాడు. గ్రౌండ్‌లోనే కాదు ఎక్కడైనా చెలరేగిపోగలడని నిరూపించుకున్నాడు. పెళ్లిలో భాంగ్రా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. పంజాబీ పాటకు స్నేహితుడితో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఈ వీడియోలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఎక్కడా కనిపించలేదు. కోహ్లీతో పాటు శిఖర్‌ధావన్, కేఎల్ రాహుల్‌లు కూడా డాన్స్ చేయడం ఇందులో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment