థర్డ్‌ అంపైర్‌ ఎవరు: కోహ్లి ఆగ్రహం | Virat Kohli Asks  On Field Umpire Who Is The Third Umpire | Sakshi
Sakshi News home page

Published Sat, May 19 2018 4:41 PM | Last Updated on Sat, May 19 2018 4:57 PM

Virat Kohli Asks  On Field Umpire Who Is The Third Umpire - Sakshi

ఫీల్డ్‌ అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం

బెంగళూరు : టీమిండియా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. గత గురువారం సన్‌రైజర్స్‌ హైదరబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లి థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతిని సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అలెక్స్‌హేల్స్‌ మిడాన్‌ దిశగా ఆడగా.. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న టీమ్‌ సౌథి ముందుకు వచ్చి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో బెంగళూరు ఆటగాళ్లు ఆనందంతో సంబరాలు చేసుకుంటుండగా.. ఫీల్డ్‌ అంపైర్లు సందేహం వ్యక్తం చేస్తూ థర్డ్‌ అంపైర్‌ను సమీక్ష కోరారు. టీవీ రిప్లేలో టీమ్‌ సౌథీ బంతి అందుకున్నట్లు స్పష్టంగా తేలింది.

కానీ అనూహ్యంగా థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ప్రకటించాడు. ఈ నిర్ణయంతో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు ఒకింత ఆశ్చర్యానికిలోనయ్యారు. ఇక కెప్టెన్‌ కోహ్లి అయితే ఫీల్డ్‌ అంపైర్‌ దగ్గరకు వచ్చి అసలు థర్డ్‌ అంపైర్‌ ఎవరని ప్రశ్నించాడు. ఈ సీజన్‌లో ఫీల్డ్‌ అంపైర్లు, థర్డ్‌ అంపైర్లు ఇలాంటి పొరపాట్లు చాలానే చేశారు. వీటిపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో విజయానందుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement