జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. ఆర‍్సీబీ స్కోరు 20 పరుగుల వద్ద ఉండగా కోహ్లి(4) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆలక్ష్య ఛేదనలో భాగంగా రాజర్సీబీ స్తాన్ రాయల్స్ స్పిన్నర్ కృష‍్ణప్ప గౌతమ్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఆడటానికి ఇబ్బంది పడ్డ కోహ్లి.. చివరకు అతని బౌలింగ్‌లోనే నిష్క్రమించాడు. ఫలితంగా ఈ సీజన్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లి ఎనిమిదోసారి ఔటయ్యాడు. ఇప‍్పటివరకూ ఈ సీజన్‌లో బెన్ స్టోక్స్, కేఎల్ రాహుల్ మాత్రమే ఏడుసార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔట్ కాగా, కోహ్లి అత్యధికంగా ఎనిమిదిసార్లు స్పిన్నర్లేకే చిక్కడం గమనార్హం.
రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కోహ్లి, పార్థీవ్ పటేల్ ఆరంభించారు. రాజస్తాన్ ఎటాకింగ్ ఓవర్‌ను స్పిన్నర్ గౌతమ్ వేయగా రెండో ఓవర్ జోఫ్రా ఆర‍్చర్ వేశాడు. మూడో ఓవర్‌ను గౌతమ్ అందుకోగా, ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతులకు నాలుగు పరుగులు రాగా, ఐదో బంతికి కోహ్లి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment