జైపూర్ : రాజస్తాన్ రాయల్స్‌తో ఓటమి తమ మంచికేనని రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్‌కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ప్రదర్శనలతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేమన్నాడు. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని ఓటమి. 75/1 స్కోర్‌తో మంచి స్థితిలో అనూహ్యంగా మిడిలార్డర్ విఫలమైంది. ఏబీ డివిలియర్స్ సిక్స్‌లు, ఫోర్లతో పోరాడినప్పటికి అతనికి ఒక్కరు కూడా అండగా నిలవలేకపోయారు. మేం తుది జట్టు విషయంలో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సింది. కేవలం 5,6 ఆటగాళ్లనే రిపీట్ చేశాం. కానీ వారిలో ఒకరిద్దరు మినహా ఎవరు రాణించలేదు. మా బలహీనతలను గుర్తించి వచ్చే సీజన్‌లో రాణిస్తాం. అన్ని సార్లు ఏబీనే బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టం. అతను స్థిరంగా రాణించాడు. కానీ అతనికి ఎవరు మద్దతు నిలవలేకపోయారు’’ అని తెలిపాడు.
జట్టులోని సానుకూల అంశాలపై ప్రస్తావిస్తూ.. ‘జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఉమేశ్, సిరాజ్, చహల్, మొయిన్ అలీలు తమవంతు కృషిచేశారు.75/1 తో పటిష్ట స్థితిలో ఉన్న మేం విజయానందుకోకపోవడం నిరాశను కలిగించింది.’’ అని పేర్కొన్నాడు. మిగతా జట్లన్నిటికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు కోహ్లి తెలిపాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఓ వారం ముందే అక్కడికి వెళ్లి కౌంటీల ఆడనున్నట్లు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment